Train Stunts Video: రైలింజన్‌పై షాకింగ్ సీన్.. విద్యుత్ పాంటోగ్రాఫ్‌తో ఎలా ఆడుకుంటున్నాడో చూస్తే..
ABN , Publish Date - Jan 28 , 2025 | 10:04 AM
రైలు ప్రయాణాల్లో కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఎలాగైనా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. కొందరు బోగీ తలుపు వద్ద కోతిలా స్టంట్స్ చేస్తే.. మరికొందరు ఏకంగా బోగీలపైకి ఎక్కి అందరికీ షాక్ ఇస్తుంటారు. ఈ క్రమంలో ..

రైలు ప్రయాణాల్లో కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఎలాగైనా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. కొందరు బోగీ తలుపు వద్ద కోతిలా స్టంట్స్ చేస్తే.. మరికొందరు ఏకంగా బోగీలపైకి ఎక్కి అందరికీ షాక్ ఇస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు కొందరు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలను కూడా చూశాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రైలింజన్‌పై ప్రమాదకర విన్యాసాలు చేశాడు. ఈ వీడియో చూసిన అది ‘‘పాంటోగ్రాఫ్ అనుకున్నావా.. లేక టీవీ యాంటెన్నా అనుకున్నావా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వేగంగా వెళ్తున్న రైలుపై ప్రమాదకర విన్యాసం చేసేందుకు సిద్ధమయ్యాడు. రైలింజన్ పైకి ఎక్కిన అతను.. అంతటితో ఆగకుండా పైన ఉండే విద్యుత్ పాంటోగ్రాఫ్‌తో ఆడుకున్నాడు. దానికి తాడు కట్టి కరెంట్ వైర్లకు తాకుండా కిందకు లాగడం, కొద్దిసేపటి తర్వాత మళ్లీ వదలడం చేశాడు.
Viral Video: పర్వతంపై రాళ్లు తొలగిస్తుండగా షాకింగ్ సీన్.. పెద్ద రాయిని పక్కకు తీసి చూడగా..
ఇలా చాలా సేపు ఆ వ్యక్తి పాంటోగ్రాఫ్‌ను కిందకు లాగుతూ (man pulling train engine pantograph) అందరికీ షాక్ ఇచ్చాడు. అతడి ప్రమాదకర విన్యాసం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. కొందరు అతడి విన్యాసాలను వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Viral Video: 13వ అంతస్తు నుంచి కిందపడ్డ బాలిక.. చివరకు జరిగింది చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..
‘‘ఇది బీహార్ చైన్ పుల్లింగ్’’.., ‘‘అదేమైనా టీవీ యాంటెన్నా అనుకున్నావా’’.., ‘‘అదేదో టీవీ యాడ్‌లా ఉంది’’.., ‘‘చావుతో సిల్లీ గేమ్ ఆడుకుంటున్నట్లుగా ఉంది’’.., ‘‘ఇది మాన్యువల్ పాంటోగ్రాఫ్’’.., ‘‘ఇలాంటి విన్యాసాలు చేయడం చాలా ప్రమాదం.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 44 వేలకు పైగా లైక్‌లు, 1.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..