Viral Video: రద్దీలోనే రైలు ఎక్కాలని చూశాడు.. చివరకు వెనక్కు తిరిగి చూసుకుని ఖంగుతిన్నాడు..
ABN , Publish Date - Jan 26 , 2025 | 01:56 PM
ఫ్లాట్‌పామ్‌పై రైలు ఆగగానే ప్రయాణికులు ఒక్కసారిగా అందులోకి ఎక్కేందుకు ఎగబడ్డారు. దీంతో డోరు వద్ద ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓ యువకుడు వారి మధ్యలోంచి రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. చివరకు జరిగిన ఘటనతో షాక్ అయ్యాడు..

రైలు ప్రయాణాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రధానంగా రైలు ఎక్కి, దిగే సమయాల్లో కొందరికి షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరు కంగారుగా రైలు ఎక్కబోతూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలను చాలా చూస్తుంటాం. ఇలాంటి సందర్భాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రద్దీగా ఉన్న రైలు ఎక్కాలని చూశాడు. చివరకు ఏమైందో మీరే చూడండి.. ః
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఫ్లాట్‌పామ్‌పై రైలు (Train) ఆగగానే ప్రయాణికులు ఒక్కసారిగా అందులోకి ఎక్కేందుకు ఎగబడ్డారు. దీంతో డోరు వద్ద ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓ యువకుడు వారి మధ్యలోంచి రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు.
అయితే ఎక్కే క్రమంలో వెనుక ఉన్న వారు అతడి చొక్కాను పట్టుకుని గట్టిగా లాగారు. దీంతో అతడి వెనుక భాగంలో షర్ట్ మొత్తం చిరిగిపోయింది. చొక్కా చిరిగిపోవడాన్ని గమనించిన ఆ వ్యక్తి వెనక్కు చూసుకుని షాక్ అవుతాడు. వెంటనే కిందకు దిగి చొక్కాను పదే పదే చూసుకుని అవాక్కవుతాడు. పక్కన ఉన్న వారు అతడి పరిస్థితిని చూసి అరే.. ఇలా జరిగేందేంటీ.. అంటూ షాక్ అవుతారు.
Monkey Viral Video: కోతికి చిక్కిన జింక పిల్ల.. గమనించిన తల్లి జింక చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదంతా చూస్తుంటే వ్యూస్ కోసం కావాలని ఇలా చేసినట్లు ఉంది’’.. అంటూ కొందరు, ‘‘అరెరే.. ఇతడికి పెద్ద కష్టమే వచ్చిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Trending Video: ఏకాగ్రతగా వేటాడటమంటే ఇదే.. మందలోని గేదెను ఈ సింహం ఎలా టార్గెట్ చేసిందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..