Trending Video: ఏకాగ్రతగా వేటాడటమంటే ఇదే.. మందలోని గేదెను ఈ సింహం ఎలా టార్గెట్ చేసిందో చూడండి..
ABN , Publish Date - Jan 26 , 2025 | 12:20 PM
అడవిలో వేట కోసం ఎదురు చూస్తున్న సింహానికి దూరంగా గేదెల మంద కనిపిస్తుంది. ఇంకేముందీ గేదెల మంద కనిపించగానే.. వాటిలో ఒక దానిపై తన టార్గెట్‌ను ఫిక్స్ చేస్తుంది. తర్వాత ఒక్కసారిగా మందపై దూకి వాటిలో టార్గెట్ చేసిన గేదెపై దూకేస్తుంది. సింహం దాడితో..

సింహం చూడటానికి ఎంత గంభీరంగా కనిపిస్తుందో.. దాని వేట కూడా అదే స్థాయిలో ఉంటుంది. కొన్నిసార్లు దాని వేట చూస్తే అంతా ఆశ్చర్యపోయేలా ఉంటుంది. గుంపులు గుంపులుగా ఉన్న జంతువుల్లోకి చొరబడి మరీ తన టార్గెట్‌ను కంప్లీట్ చేస్తుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సింహం గేదెల మందపైకి దూకి చివరకు వాటిలో ఒకదాన్ని ఎంతో చాకచక్యంగా వేటాదింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఏకాగ్రతగా వేటాడటమంటే ఇదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో వేట కోసం ఎదురు చూస్తున్న సింహానికి దూరంగా గేదెల మంద కనిపిస్తుంది. ఇంకేముందీ గేదెల మంద కనిపించగానే.. వాటిలో ఒక దానిపై తన టార్గెట్‌ను ఫిక్స్ చేస్తుంది. తర్వాత ఒక్కసారిగా మందపై దూకి (Lion attack on buffalo) వాటిలో టార్గెట్ చేసిన గేదెపై దూకేస్తుంది. సింహం దాడితో గేదెలన్నీ చెల్లాచెదురుగా పారిపోతాయి.
Woman Reels Video: మృతదేహం పక్కన అంతా ఏడుస్తుంటే.. మృతుడి అక్క వింత నిర్వాకం.. ఎదురుగా కూర్చుని..
అయినా సింహం మాత్రం చివరకు టార్గెట్ పెట్టిన గేదెను పట్టేసుకుంటుంది. అయితే ఈ క్రమంలో సింహం కిందపడిపోతుంది. అయినా పట్టు వదలకుండా గేదెను అలాగే గట్టిగా పట్టుకుంటుంది. కొంత దూరం సింహాన్ని గేదె లాక్కెళ్లిపోతుంది. అయితే చివరకు సింహం గేదెపై పైచేయి సాధిస్తుంది. మెడను గట్టిగా పట్టుకుని కింద పడేస్తుంది. ఇలా చివరకు దాన్ని చంపేసి తన ఆకలి తీర్చుకుంటుంది. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరుగుతుంది.
Viral Video: కుందేలా మజాకా..! పట్టుకోవడానికి ప్రయత్నించిన కుక్కలకు చుక్కలు చూపించిందిగా..
కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. సింహం వేట ఇంత దారుణంగా ఉంటుందా’’.. అంటూ కొందరు, ‘‘అందుకే సింహాన్ని అడవికి రాజుగా పిలుస్తారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1700కి పైగా లైక్‌లు, 57 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే జంతువులే కాదు మనుషులూ హడలిపోవాల్సిందే.. ఈ రైతు చేసిన పని చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..