Share News

Woman Reels Video: మృతదేహం పక్కన అంతా ఏడుస్తుంటే.. మృతుడి అక్క వింత నిర్వాకం.. ఎదురుగా కూర్చుని..

ABN , Publish Date - Jan 26 , 2025 | 11:40 AM

ఓ వ్యక్తి మృతదేహాన్ని ఇంటి ఇంట్లో పడుకోబెట్టారు. మృతదేహం పక్కన కూర్చున్న వారంతా ఏడుస్తూ ఉన్నారు. మృతుడి భార్య బోరున విలపిస్తూ ఉంది. అయితే అక్కడే కూర్చున్న మృతుడి సోదరి మాత్రం బాధపడుతున్నట్లు అనిపించినా.. ఆ వెంటనే..

Woman Reels Video: మృతదేహం పక్కన అంతా ఏడుస్తుంటే.. మృతుడి అక్క వింత నిర్వాకం.. ఎదురుగా కూర్చుని..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది రీల్స్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. మిగతా పనులన్నీ పక్కన పెట్టి రోజంతా ఇదే పనిలోనే ఉంటున్నారు. కొందరైతే రీల్స్ పిచ్చిలో పడి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు వింత వింత విన్యాసాలు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం ఎదుటివారి చావును కూడా తమ రీల్స్ కోసం వాడుకుంటున్నారు. ఇలాంటి విచిత్రమైన మనుషలుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మృతదేహం పక్కన అంతా ఏడుస్తుంటే.. మృతుడి అక్క మాత్రం విచిత్రంగా ప్రవర్తించింది. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మృతదేహాన్ని ఇంటి ఇంట్లో పడుకోబెట్టారు. మృతదేహం పక్కన కూర్చున్న వారంతా ఏడుస్తూ ఉన్నారు. మృతుడి భార్య బోరున విలపిస్తూ ఉంది. అయితే అక్కడే కూర్చున్న మృతుడి సోదరి మాత్రం బాధపడుతున్నట్లు అనిపించినా.. ఆ వెంటనే అంతా అవాక్కయ్యేలా ప్రవర్తించింది.

Viral Video: దండలు మార్చుకుంటున్న వధూవరులు.. మధ్యలో వేదికపైకి వెళ్లిన యువకుడు.. వరుడి చెవిలో సీక్రెట్ చెప్పడంతో..


ఫోన్ కెమెరా ఆన్ చేసి వీడియో (woman doing reels next to dead body) తీయడం స్టార్ట్ చేసింది. అంతటితో ఆగకుండా కెమెరా వైపు చూస్తూ.. తన తమ్ముడి భార్యకు ధైర్యం చెబుతోంది. ‘‘ఏడవకమ్మా.. జననం, మరణం అనేవి ఎవరికీ తెలియదు.. ఉన్న వారంతా కలిసిమెసలి సంతోషంగా ఉండాలి’’.. అంటూ ఇలా నీతిసూక్తులు చెబుతూ ఆమెకు అవగాహన కల్పిస్తోంది. అదేదో సినిమా షూటింగ్ తరహాలో ఆమె ప్రవర్తించిన తీరు చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

Viral Video: కుందేలా మజాకా..! పట్టుకోవడానికి ప్రయత్నించిన కుక్కలకు చుక్కలు చూపించిందిగా..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ దేశానికి ఏమైంది.. రీల్స్ పిచ్చిలో ఎక్కడికి వెళ్తున్నారీ జనం’’.. అంటూ కొందరు, ‘‘ఎవరి చచ్చినా అనవసరం.. రీల్ చేయడమే ఈమె ముందున్న ధ్యేయం’’.. అంటూ మరికందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3100కి పైగా లైక్‌లు, 5.20 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే జంతువులే కాదు మనుషులూ హడలిపోవాల్సిందే.. ఈ రైతు చేసిన పని చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 26 , 2025 | 11:40 AM