Share News

Monkey Viral Video: కోతికి చిక్కిన జింక పిల్ల.. గమనించిన తల్లి జింక చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

ABN , Publish Date - Jan 26 , 2025 | 12:51 PM

ఓ బబూన్ కోతికి జింక పిల్ల కనిపిస్తుంది. దీంతో వెంటనే ఆ కోతి జింక పిల్లను ఎత్తుకుని పారిపోతుంది. తన పిల్లను కోతి ఎత్తుకుపోవడాన్ని గమనించిన జింక.. పరుగులు పెడుతూ దాని వద్దకు చేరుకుంటుంది. చివరకు ఏమైందో చూడండి..

Monkey Viral Video: కోతికి చిక్కిన జింక పిల్ల.. గమనించిన తల్లి జింక చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

తల్లి ప్రేమకు సాటి మరేదీ లేదనది అక్షర సత్యం. మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది. మనుషుల్లోనే కొందరు తమ పిల్లల పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. అయితే జంతువులు మాత్రం తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా మారుతుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బబూన్ కోతికి జింక పిల్ల దొరికింది. దాన్ని ఎత్తుకుని పారిపోయే సమయంలో తల్లి జింక గమనించింది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ బబూన్ కోతికి జింక పిల్ల కనిపిస్తుంది. దీంతో వెంటనే ఆ కోతి జింక పిల్లను (baboon snatches baby deer) ఎత్తుకుని పారిపోతుంది. తన పిల్లను కోతి ఎత్తుకుపోవడాన్ని గమనించిన జింక.. పరుగులు పెడుతూ దాని వద్దకు చేరుకుంటుంది. కోతి పైకి ఆవేశంగా దూకుతూ తలతో దాన్ని ఢీకొడుతుంది.

Trending Video: ఏకాగ్రతగా వేటాడటమంటే ఇదే.. మందలోని గేదెను ఈ సింహం ఎలా టార్గెట్ చేసిందో చూడండి..


‘‘నా పిల్లను నాకు వదిలేయ్.. లేదంటే నీ ప్రాణాలు తీస్తా’’.. అన్నట్లుగా కోతి పైకి విరుచుకుపడుతుంది. మరోవైపు కోతి జింక పిల్లను గట్టిగా పట్టుకుని దూరంగా పారిపోతుంటుంది. మధ్య మధ్యలో జింక పిల్లను పట్టుకుని కొరికే ప్రయత్నం చేస్తుంటుంది. దీన్ని చూసిన తల్లి జింక తల్లడిల్లిపోతుంది. ఎలాగైనా తన పిల్లను విడిపించుకోవాలనే కోపంతో కోతిని వెంటపడి మరీ దాడి చేస్తుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Woman Reels Video: మృతదేహం పక్కన అంతా ఏడుస్తుంటే.. మృతుడి అక్క వింత నిర్వాకం.. ఎదురుగా కూర్చుని..


కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఈ తల్లి జింకను చూస్తుంటే చాలా బాధగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘స్వచ్ఛమైన తల్లి ప్రేమ ఎలా ఉంటుదో ఈ జింకను చూస్తే తెలుస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 900కి పైగా లైక్‌‌లు, 2.23 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే జంతువులే కాదు మనుషులూ హడలిపోవాల్సిందే.. ఈ రైతు చేసిన పని చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 26 , 2025 | 12:51 PM