Viral Video: జొన్నలు తినకుండా పక్షులకు భలే షాకిచ్చాడుగా.. ఈ రైతు తెలివితేటలు చూస్తే మతి పోవాల్సిందే..
ABN , Publish Date - Jan 28 , 2025 | 07:02 AM
పొలాల్లోకి జంతువులు రాకుండా రాత్రివేళ్లల్లో డప్పు కొట్టే వారిని చూశాం, నిత్యం చప్పుడు చేస్తుండేలా వినూత్న ఏర్పాట్లు చేయడం చూశాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది..

రైతులు తమ పంటను రక్షించుకోవడానికి ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు రైతుల ప్రయోగాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరు రైతుల ప్రయోగాలు అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. పొలాల్లోకి జంతువులు రాకుండా రాత్రివేళ్లల్లో డప్పు కొట్టే వారిని చూశాం, నిత్యం చప్పుడు చేస్తుండేలా వినూత్న ఏర్పాట్లు చేయడం చూశాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘పక్షులకు భలే షాకిచ్చాడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. జొన్న పంట (Sorghum crop) సాగు చేస్తున్న ఓ రైతు తన పంటను పక్షులు తినకుండా వినూత్న ఏర్పాట్లు చేశాడు. మిగతా రైతుల్లో డప్పుకొట్టడం, దిష్టిబొమ్మలు ఏర్పాటు చేయడం కాకుండా.. మొక్క మొక్కకూ ఉన్న జొన్న కంకులపై సగం కట్ చేసిన ప్లాస్టిక్ సీసాలను మూసి ఉంచాడు.
Viral Video: రద్దీలోనే రైలు ఎక్కాలని చూశాడు.. చివరకు వెనక్కు తిరిగి చూసుకుని ఖంగుతిన్నాడు..
ఇలా అన్ని మొక్కలపై ప్లాస్టింగ్ బాటిళ్లు (Plastic bottles on sorghum plants) ఏర్పాటు చేసి, పక్షులు రాకుండా వినూత్న చర్యలు చేపట్టాడు. ఈ రైతు చేసిన వినూత్న చర్యలు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.., ‘‘పక్షులకు ఆహారం పెట్టని ఇతను ఒక రైతేనా’’.., ‘‘పండించిన పంటలో ఒక వంతు ఖర్చు చేయాలి’’.., ‘‘ఇన్ని మొక్కలకు బాటిల్స్ సేకరించడం ఎలా సాధ్యం’’.., ‘‘ఇదంతా వృథా ప్రయాస.. కేవలం వ్యూస్ కోసం చేసినట్లుగా అనిపిస్తోంది’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7వేలకు పైగా లైక్‌లు, 6.22 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Monkey Viral Video: కోతికి చిక్కిన జింక పిల్ల.. గమనించిన తల్లి జింక చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..