Share News

Crocodile Viral Video: వామ్మో..! మొసలి నోట్లోనే తల పెట్టాడు.. చివరికి జరిగింది చూస్తే కళ్లు తేలేస్తారు..

ABN , Publish Date - Jan 26 , 2025 | 01:44 PM

ఓ వ్యక్తి నీటి ఒడ్డున ఉన్న భారీ మొసలితో విచిత్రమైన విన్యాసం చేసేందుకు ముందుకొచ్చాడు. మొసలి వద్దకు వెళ్లిన ఆ వ్యక్తి దాని నోట్లో తల పెట్టేందుకు ప్రయత్నించాడు. అతను దగ్గరికి రావడం చూసిన మొసలి.. నోరు తెరచి పడుకుంది. మెల్లగా మొసలి వద్దకు వెళ్లిన ఆ వ్యక్తి.. తన తలను ..

Crocodile Viral Video: వామ్మో..! మొసలి నోట్లోనే తల పెట్టాడు.. చివరికి జరిగింది చూస్తే కళ్లు తేలేస్తారు..

కొందరు ప్రమాదకరమైన పులులు, సింహాలు, చింపాజీలు, మొసళ్లు, పాములతో ఆడుకోవడం చూస్తుంటాం. ఏమాత్రం భయం లేకుండా వాటితో కలిసి తిరుగుతుంటారు. కొందరు వాటిని చిన్న పిల్లల తరహాలో చూస్తూ చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు చావు అంచుల దాకా వెళ్లి తిరిగి వస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఏకంగా మొసలి నోట్లోనే తల పెట్టాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి నీటి ఒడ్డున ఉన్న భారీ మొసలితో విచిత్రమైన విన్యాసం చేసేందుకు ముందుకొచ్చాడు. మొసలి వద్దకు వెళ్లిన ఆ వ్యక్తి దాని నోట్లో తల పెట్టేందుకు ప్రయత్నించాడు. అతను దగ్గరికి రావడం చూసిన మొసలి.. నోరు తెరచి పడుకుంది. మెల్లగా మొసలి వద్దకు వెళ్లిన ఆ వ్యక్తి.. తన తలను దాని నోట్లోకి పెట్టే ప్రయత్నం చేశాడు.

Monkey Viral Video: కోతికి చిక్కిన జింక పిల్ల.. గమనించిన తల్లి జింక చివరకు ఏం చేసిందో మీరే చూడండి..


మొసలి నోరు మూసేలోగా తల పక్కకు తీయాలనేది అతడి ఉద్దేశం. అయితే అతను ఇలా నోట్లో తల పెట్టగానే మొసలి ఒక్కసారిగా తన నోటితో టక్కన పట్టేసుకుంటుంది. అయితే ఆ వెంటనే మళ్లీ వదిలేస్తుంది. మొసలి పంటి గాట్లు పడడంతో అతను నొప్పితో విలవిల్లాడిపోతాడు. చూస్తుంటే అతను శిక్షణ పొందిన వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు. అంతా చూస్తుండగా మొసళ్లతో విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. కొందరు మొసళ్ల నోటిలో చేతులు పెట్టడం, అవి నోరు మూసేలోపు బయటికి తీసేయడం కూడా చేస్తుంటారు.

Trending Video: ఏకాగ్రతగా వేటాడటమంటే ఇదే.. మందలోని గేదెను ఈ సింహం ఎలా టార్గెట్ చేసిందో చూడండి..


గతంలో ఓ వ్యక్తి ఇలా మొసలి నోట్లో చేతి పెట్టగా కొరికేసిన ఘటన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తలను కొరికిన (Crocodile Bites Man Head) మొసలి వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎంత ట్రైనింగ్ ఇచ్చినా మొసళ్లతో ఇలాంటి ఆటలు ఆడడం ఎంతో ప్రమాదం’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2300కి పైగా లైక్‌లు, 1.64 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Woman Reels Video: మృతదేహం పక్కన అంతా ఏడుస్తుంటే.. మృతుడి అక్క వింత నిర్వాకం.. ఎదురుగా కూర్చుని..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 26 , 2025 | 01:44 PM