Share News

Leopard Viral Video: పాల క్యాన్లతో వెళ్తున్న వ్యక్తి.. సడన్‌గా రోడ్డు పైకి వచ్చిన చిరుత.. తీరా చూస్తే..

ABN , Publish Date - Feb 11 , 2025 | 05:29 PM

ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ చిరుత పులి స్థానిక ప్రాంతానికి వచ్చేసింది. ఇళ్ల మధ్యలో నుంచి మెల్లిగా రోడ్డు వద్దకు వచ్చిన చిరుత.. చివరకు ఒక్కసారిగా గోడపై నుంచి దూకి రోడ్డు పైకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఓ వ్యక్తి పాల క్యాన్లతో అటుగా వచ్చాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..

Leopard Viral Video: పాల క్యాన్లతో వెళ్తున్న వ్యక్తి.. సడన్‌గా రోడ్డు పైకి వచ్చిన చిరుత.. తీరా చూస్తే..

అడవి జంతువులు జనావాసాల్లోకి చొరబడడం నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఆస్తి నష్టంతో పాటూ ప్రాణనష్టం కూడా జరుగుతుంటుంది. మరికొన్నిసార్లు కొందరు వాటి బారిన పడి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. మరికొన్నిసార్లు చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ చిరుత పులి సడన్‌గా రోడ్డు పైకి వచ్చింది. అదే సమయంలో ఓ వ్యక్తి పాల క్యాన్లతో బైకుపై అటుగా వచ్చాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని (Rajasthan) ఉదయపూర్‌లోని శిల్ప్‌గ్రామ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానిక మెయిన్ రోడ్డులో రాత్రి సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ చిరుత పులి స్థానిక ప్రాంతానికి వచ్చేసింది. ఇళ్ల మధ్యలో నుంచి మెల్లిగా రోడ్డు వద్దకు వచ్చిన చిరుత.. చివరకు ఒక్కసారిగా గోడపై నుంచి దూకి రోడ్డు పైకి దూసుకెళ్లింది.

Woman Viral Video: పీక్స్‌కు వెళ్లిన ఫోన్ పిచ్చి.. చెత్త అనుకుని పిల్లాడిని ఏం చేసిందో చూడండి..


అయితే అదే సమయంలో బైకుపై పాల క్యాన్లతో వస్తున్న వ్యక్తి (milkman collided with leopard) చిరుతను ఢీకొట్టాడు. వేగంగా వచ్చి చిరుతను ఢీకొట్టడంతో దూరంగా ఈడ్చుకుంటూ వెళ్లి పడిపోయాడు. అలాగే బైకు గట్టిగా ఢీకొట్టడంతో చిరుత కొద్దిసేపు అలాగే కదలకుండా పడిపోయింది. తర్వాత పైకి లేచి అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనతో కొందర స్థానికులు ఇళ్ల నుంచి బయటికి వస్తారు. అయితే అతడిని కాపాడాలని ప్రయత్నించినా.. ఎక్కడ చిరుత మళ్లీ వచ్చి దాడి చేస్తుందేమో అనుకుని ఆగిపోతారు. ఇంతలో ఓ కారు యజమాని బైకర్ వద్దకు వచ్చి ఆపుతాడు.

Viral: రాత్రి వేళ్ల ఆవు షెడ్‌లోకి వెళ్లిన చిరుత.. అనుమానం వచ్చి ఉదయం సీసీ ఫుటేజీ చూడగా షాకింగ్ సీన్..


తర్వాత గాయపడ్డ అతన్ని స్థానికులు కారులో ఎక్కించి తీసుకెళ్తారు. ఈ ప్రమాదంలో క్యాన్లు కిందపడిపోవడంతో పాలన్నీ రోడ్డుపై పడిపోయాయి. కాగా, ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి టైం ఎంతో బాగుంది.. స్వల్పగాయాలతో బయటపడ్డాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1500కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 11 , 2025 | 05:29 PM