Share News

Woman Viral Video: పీక్స్‌కు వెళ్లిన ఫోన్ పిచ్చి.. చెత్త అనుకుని పిల్లాడిని ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Feb 11 , 2025 | 04:36 PM

ఓ మహిళ తన పిల్లాడిని ఎత్తుకుని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇంట్లోని చెత్తనంతా ఓ కవర్‌లో వేసుకుని డస్ట్ బిన్‌లో పడేయడానికి బయటికి వస్తుంది. ఆ సమయంలోనూ ఆమె ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అంతా అవాక్కయ్యే సంఘటన చోటు చేసుకుంది..

Woman Viral Video: పీక్స్‌కు వెళ్లిన ఫోన్ పిచ్చి.. చెత్త అనుకుని పిల్లాడిని ఏం చేసిందో చూడండి..

ప్రస్తుతం చిన్న పిల్లలే కాకుండా పెద్దలు, వృద్ధులు కూడా స్మార్ట్ ఫోన్‌కు ఎడిక్ట్ అవుతున్నారు. ఇక ఇంటి పనులు చేసుకునే మహిళలు కూడా నిత్యం ఫోన్లకు అలవాటు పడి.. పనులు చేయడంలో బద్ధకిస్తున్నారు. కొందరైతే ఫోన్ చూసుకుంటూ చేసే పనులను కూడా సక్రమంగా చేయలేకున్నారు. కొన్నిసార్లు ఇలాంటి సమయాల్లో ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ పిల్లాడిని ఎత్తుకుని, ఫోన్ మాట్లాడుతూ చివరకు ఏం చేసిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన పిల్లాడిని ఎత్తుకుని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇంట్లోని చెత్తనంతా ఓ కవర్‌లో వేసుకుని డస్ట్ బిన్‌లో పడేయడానికి బయటికి వస్తుంది. ఆ సమయంలోనూ (Woman talking on phone) ఆమె ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అంతా అవాక్కయ్యే సంఘటన చోటు చేసుకుంది.

Tiger Funny Video: పులి నోట చిక్కిన పిల్లాడి చొక్కా.. చివరికి జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


చెత్తబుట్టలో చెత్తకు బదులుగా ( mother threw the child industbin) పిల్లాడిని వేసి వెళ్లిపోతుంది. అయితే నాలుగు అడుగులు వేయగానే.. చేతుల్లో పిల్లాడు లేకపోవడాన్ని చూసి షాక్ అవుతుంది. తాను చేసిన తప్పు తెలుసుకుని నాలుక్కరుచుకుని, తిరిగి వచ్చి పిల్లాడిని ఎత్తుకుంటుంది. ఇలా ఫోన్ పిచ్చిలో పడి ఏం చేస్తుందో తనకే తెలీనంతగా మారిపోయిన ఈ మహిళను చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral: రాత్రి వేళ్ల ఆవు షెడ్‌లోకి వెళ్లిన చిరుత.. అనుమానం వచ్చి ఉదయం సీసీ ఫుటేజీ చూడగా షాకింగ్ సీన్..


అయితే ఇదంతా అవగాహన కల్పించడానికి చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా.. ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫోన్ పిచ్చిలో పడితే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘పిల్లలతో ఇలాంటి పనులు చేయడం ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 22వేలకు పైగా లైక్‌లు, 2.5 మిలియన్‌కు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 11 , 2025 | 04:43 PM