Share News

Viral video: ట్రైన్ ముందు నిలబడి యువతి ఫోజ్.. ఇంజిన్ సమీపానికి రాగానే.. డ్రైవర్ చేసిన పనేంటంటే..

ABN , Publish Date - Jun 29 , 2024 | 05:09 PM

సెల్ఫీల పిచ్చిలో పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవడం చూస్తున్నాం. అయినా చాలా మందిలో ఇంకా మార్పు రావడం లేదు. ఇప్పటికీ కొందరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ...

Viral video:  ట్రైన్ ముందు నిలబడి యువతి ఫోజ్.. ఇంజిన్ సమీపానికి రాగానే.. డ్రైవర్ చేసిన పనేంటంటే..

సెల్ఫీల పిచ్చిలో పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవడం చూస్తున్నాం. అయినా చాలా మందిలో ఇంకా మార్పు రావడం లేదు. ఇప్పటికీ కొందరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రమాకర స్థితిలో సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదానికి గురవుతున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి కూడా ఇలాగే చేసింది. వినూత్నంగా కనిపిస్తున్న ఓ రైలు ముందు సెల్ఫీ వీడియో తీసుకోవాలని అనుకుంది. అయితే తీరా రైలు సమానికి రాగానే డ్రైవర్ ఏం చేశాడో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రైలు ముందు సెల్ఫీలు (Selfie) తీసుకుంటూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలను చూశాం. ఇటీవలే ఓ యువతి (young woman) ఆవిరితో నడిచే రైలు ముందు సెల్ఫీ తీసుకుంటూ ఇంజిన్ ఢీకొట్టి చనిపోయిన విషయం కూడా తెలిసిందే. తాజాగా, ఓ యువతి ఇలాగే వినూత్నమైన రైలు ఇంజిన్ ముందు వీడియో తీసుకోవాలని ప్రయత్నించింది. పట్టాలపై పొగలు కక్కుతూ వస్తున్న రైలు ఇంజిన్ (train engine) ముందు ఓ యువతి నిబబడి ఉండగా.. మరో వ్యక్తి వీడియో (Video) తీస్తున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Viral video: దూడకు జన్మనిచ్చిన గేదె.. పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి.. ట్విస్ట్ ఏంటో తెలిస్తే.. నవ్వు ఆపుకోలేరు..


తీరా ఇంజిన్ సమీపానికి రాగానే డ్రైవర్ బయటికి వచ్చి ప్రమాదకరంగా నిలబడి ఉన్న యువతిని (train driver kicking woman) కాలితో పక్కకు తోసేశాడు. దెబ్బకు ఆమె దూరంగా పడిపోయింది. రైలు ఇంజిన్ ముందు వీడియోలు తీసుకోవడం ప్రమాదమని తెలిసినా ఈ యువతి చేసిన పిచ్చి పనికి.. డ్రైవర్ ఇలా మందలించాడన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రైలు డ్రైవర్ మంచి పని చేశాడు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.30లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: నీళ్లలో రోడ్ డివైడర్స్.. సమీపానికి వెళ్లి చూస్తే ఒళ్లు గగుర్పొడిచే సీన్..

Updated Date - Jun 29 , 2024 | 05:09 PM