Leopards Viral: పొలాల్లోకి చొరబడ్డ చిరుతలు.. కెమెరా జూమ్ చూసి చూడగా షాకింగ్ సీన్..
ABN , Publish Date - Feb 13 , 2025 | 04:00 PM
పులులు, సింహాలు.. జనావాసాల్లోకి చొరబడి హల్‌చల్ చేయడం నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సమయాల్లో చాలా సార్లు మనుషులు, జంతువులపై దాడికి దిగుతుంటాయి. అయితే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. భయపెట్టాల్సిన క్రూరజంతువులు కాస్తా..

పులులు, సింహాలు.. జనావాసాల్లోకి చొరబడి హల్‌చల్ చేయడం నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సమయాల్లో చాలా సార్లు మనుషులు, జంతువులపై దాడికి దిగుతుంటాయి. అయితే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. భయపెట్టాల్సిన క్రూరజంతువులు కాస్తా.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఈ తరహా విచిత్ర ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. చిరుత పులులు వ్యవసాయ పొలాల్లోకి చొరబడ్డాయి. వీడియో తీస్తున్న రైతులు కెమెరాను జూమ్ చేసి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది.
సోషల్ మీడియాలో చిరుతలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు (Viral photos and videos) తెగ వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్ర (Maharashtra) సాంగ్లి జిల్లా వాల్వా తాలూకా పరిధి పోఖరాని ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమీప అటవీ ప్రాంతం నుంచి ఇటీవల రెండు చిరుతపులులు (Leopards entering sugarcane field) స్థానిక చెరుకు పొలంలోకి చొరబడ్డాయి. సమీప పొలాల్లో పని చేసుకుంటున్న రైతులకు అనుమానం వచ్చి ఫోన్లలో వీడియో తీశారు.
Viral Video: ఈ కొళాయి ఆన్ చేయాలంటే బ్రెయిన్ వాడాలి.. ఎలా తయారు చేశారో చూడండి..
దూరంగా ఏవో జంతువులు ఉన్నట్లు కనిపించాయి. అయితే కెమెరాను జూమ్ చేసి చూడగా.. రెండు చిరుతపులులు పొలంలో సరదాగా గడుపుతున్నట్లు కనిపించాయి. ఆ రెండు పులులు చిన్న పిల్లల తరహాలో పొలంలో పొర్లుకుంటూ ఆడుకుంటున్నాయి. చిరుత పులులు ఇలా చిన్న పిల్లల తరహాలో ఆడుకోవడం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు చిరుత పులులు అని తెలియగానే భయంతో పారిపోయారు.
Marriage Viral Video: ఇది మామూలు ట్విస్ట్ కాదు బాబోయ్.. ఈ వధూవరులను చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..
చిరుత పులులు నిత్యం స్థానిక ప్రాంతాల్లోకి వస్తున్నాయని, అటవీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ చిరుతలు మరీ విచిత్రంగా ఉన్నాయే’’.. అంటూ కొందరు, ‘‘చిన్నపిల్లల్లా ఆడుకుంటున్న చిరుతలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: సీసీ కెమెరాలో క్రికెట్ మ్యాచ్.. వీళ్ల తెలివితేటలు మామూలుగా లేవుగా..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..