Marriage Viral Video: ఇది మామూలు ట్విస్ట్ కాదు బాబోయ్.. ఈ వధూవరులను చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..
ABN , Publish Date - Feb 12 , 2025 | 08:41 PM
వివాహం అంటే ఏదో ఒక వింత సంఘటన జరిగి తీరాల్సిందే.. అన్నట్లుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. కొందరు కావాలని ప్లాన్ చేసి ఏవేవో ప్రాంక్‌లు ప్లాన్ చేస్తుంటారు. కొన్నిసార్లు అనుకోకుండానే అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి..

వివాహం అంటే ఏదో ఒక వింత సంఘటన జరిగి తీరాల్సిందే.. అన్నట్లుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. కొందరు కావాలని ప్లాన్ చేసి ఏవేవో ప్రాంక్‌లు ప్లాన్ చేస్తుంటారు. కొన్నిసార్లు అనుకోకుండానే అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పెళ్లి వేదికపై వధూవరులు దండలు మార్చుకుంటున్నారు. అయితే ఆ పక్కనే వధూవరులు నిలబడి ఉండడాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇది మామూలు ట్విస్ట్ కాదు బాబోయ్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో వధూవరులు వేదికపై దండలు మార్చుకుంటున్నారు. దండలు మార్చుకున్న అంనతరం వధువు ఓ బంగారు గొలుసును వరుడి మెడలో వేసింది. ఇలా ఆ ఇద్దరూ ఎంతో సంతోషంగా దండలు మార్చుకుంటూ కనిపించారు.
Snake Bite Video: చెప్పును కాటేసిన పాము.. విషాన్ని ఎలా విడుదల చేసిందో చూడండి..
ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. వధూవరులు కూర్చున్న వేదిక పక్కనే ఇంకో నూతన జంట నిలబడి ఉంది. అయితే వేదికపైన ఉన్న జంట, కింద నిలబడి ఉన్న జంట సేమ్ టూ సేమ్ ఒకేలా ఉన్నారు. వరుడు, వధువు ఇద్దరూ (Twins bride and groom) కవల పిల్లలని తెలిసింది. అయితే ఎవరో ఒకరు కవల పిల్లలు ఉండడం సర్వసాధారణం.
Viral Video: సీసీ కెమెరాలో క్రికెట్ మ్యాచ్.. వీళ్ల తెలివితేటలు మామూలుగా లేవుగా..
అయితే ఇలా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఒకే పోలికలతో ఉండడం, పెళ్లి చేసుకోవడం మాత్రం చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. దీంతో ఈ వివాహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ట్విన్స్.. ట్విన్స్‌నే పెళ్లి చేసుకోవడం సూపర్’’.. అంటూ కొందరు, ‘‘వీళ్ల జీవితం మొత్తం కన్ఫ్యూజన్‌గా సాగుతుంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 89 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: రైల్లో రొటీన్ సమస్యకు వింత పరిష్కారం.. ఇతడి తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..