Snake Bite Video: చెప్పును కాటేసిన పాము.. విషాన్ని ఎలా విడుదల చేసిందో చూడండి..
ABN , Publish Date - Feb 12 , 2025 | 08:26 PM
ఇంట్లోకి దూరిన ఓ పాము రాళ్ల మధ్యలోంచి గోడలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటుంది. దీన్ని గమనించిన ఇంటి యజమాని పాము వద్దకు వెళ్లి చెప్పును తాకిస్తాడు. దీంతో పాము ఒక్కసారిగా చెప్పుపై దాడి చేస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

పాములకు సంబంధించిన అనేక వీడియోలను సోషల్ మీడియాలో చూస్తుంటాం. కొందరు పాములను కెలికిమరీ ఆటలాడుతుంటారు. ఈ క్రమంలో పాము కాటుకు గురై చాలా మంది చనిపోతుంటారు. ఒక్క చుక్క పాము విషం శరీరంలోకి వెళ్లినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటిది ఒకేసారి ధారగా విషం బయటికి వస్తే ఇంకెలా ఉంటుంది. తాజాగా వైరల్ అవుతున్న పాము వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. చెప్పును పాము కాటేయగానే విషం విడుదల చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇంట్లోకి దూరిన ఓ పాము రాళ్ల మధ్యలోంచి గోడలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటుంది. దీన్ని గమనించిన ఇంటి యజమాని పాము వద్దకు వెళ్లి చెప్పును తాకిస్తాడు. దీంతో పాము ఒక్కసారిగా చెప్పుపై దాడి చేస్తుంది. చెప్పును గట్టిగా కొరికి విషాన్ని విడుదల చేస్తుంది.
Viral Video: సీసీ కెమెరాలో క్రికెట్ మ్యాచ్.. వీళ్ల తెలివితేటలు మామూలుగా లేవుగా..
ఇలా చాలా సేపు చెప్పును కొరికి (snake bit on sandal) పట్టుకుని, విషాన్ని బయటికి వదిలేస్తుంది. చివరకు పాము నోటి నుంచి చాలా విషం బయటికి వస్తుంది. ఈ విషం మొత్తం మనిషి శరీరంలోకి వెళ్తే పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: రైల్లో రొటీన్ సమస్యకు వింత పరిష్కారం.. ఇతడి తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో ఇంత విషం శరీరంలోకి వెళ్తే పరిస్థితి ఏంటో’’.. అంటూ కొందరు, ‘‘పాములకు హాని చేయకుంటే అవి ఎవరికీ ఎలాంటి హానీ చేయవు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2100కి పైగా లైక్‌లు, 3.96 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: చోరీ చేయడంలో పీజీ చేసినట్టున్నాడే.. ఎలా కొట్టేశాడో చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..