Viral Video: రైల్లో రొటీన్ సమస్యకు వింత పరిష్కారం.. ఇతడి తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Feb 12 , 2025 | 06:44 PM
రైలు ప్రయాణ సమయాల్లో అనేక రకాల సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇవన్నీ వీడియోల రూపంలో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటాయి. సీట్ల కోసం కుస్తీ పడేవారు కొందరైతే.. మరికొందరు ఏకంగా సీటును క్రియేట్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. ఇలాంటి..

రైలు ప్రయాణ సమయాల్లో అనేక రకాల సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇవన్నీ వీడియోల రూపంలో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటాయి. సీట్ల కోసం కుస్తీ పడేవారు కొందరైతే.. మరికొందరు ఏకంగా సీటును క్రియేట్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. ఇలాంటి వినూత్న విన్యాసాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ వ్యక్తి విచిత్ర ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రైల్లో రొటీన్ సమస్యలకు ఓ వ్యక్తి కనుగొన్న పరిష్కారం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ రైల్లో (Train) ప్రయాణికులు కిక్కిరిసి ఉంటారు. సాధారణంగా సీట్లలో కూర్చున్న వారు నిద్రపోతున్న సమయంలో పక్కన ఉన్న వారిపై వాలుతుంటారు. ఇలా జరగకూడదని ఎంత ప్రయత్నించినా నిద్రలోకి జారుకోగానే ఆటోమేటిక్‌గా అలా జరిగిపోతుంటుంది.
Viral Video: ఎస్కలేటర్‌పై హృదయ విదారక ఘటన.. కొడుకును కాపాడిన తల్లి.. చూస్తుండగానే..
అయితే ఓ వ్యక్తి ఈ సమస్య నుంచి బయటపడేందుకు వినూత్న పరిష్కారాన్ని కనుక్కున్నాడు. తాను కూర్చున్న చోట పైన ఉన్న ఇనుప కడ్డీకి తన టవల్ కట్టి వేలాడదీశాడు. తర్వాత గుండ్రంగా ఉన్న టవల్ మధ్యలో (Man tied towel on his head) తన తలను పెట్టేశాడు. దీంతో అటూ, ఇటూ వాలిపోకుండా నిటారుగా ఉంటుందని తన ఉద్దేశం. ఇతడి విచిత్ర ప్రయోగం చూసి అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు.
Viral Video: చోరీ చేయడంలో పీజీ చేసినట్టున్నాడే.. ఎలా కొట్టేశాడో చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..
కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘నిద్రపోతున్నాడా.. ఉరి వేసుకుంటున్నాడా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 60 వేలకు పైగా లైక్‌లు, 1.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: కారును ఓవర్‌టేక్ అయితే చేశారు గానీ.. ముందు వైపు చూసి ఖంగుతిన్నారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..