Share News

Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే జంతువులే కాదు మనుషులూ హడలిపోవాల్సిందే.. ఈ రైతు చేసిన పని చూస్తే..

ABN , Publish Date - Jan 26 , 2025 | 08:21 AM

ఓ రైతు తన పొలంలోకి అడవి జంతువులు రాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అతను వివిధ రకాలుగా ఆలోచించి, చివరకు ఎవరూ చేయని విధంగా వింత నిర్ణయం తీసుకున్నాడు. అందరిలా దిష్టిబొమ్మలు పెట్టకుండా..

Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే జంతువులే కాదు మనుషులూ హడలిపోవాల్సిందే.. ఈ రైతు చేసిన పని చూస్తే..

అడవి జంతువులు పంట పొలాల్లోకి వెళ్లి బీభత్సం చేయడం చూస్తుంటాం. దీంతో కొన్నిసార్లు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. జంతువుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు పొలాల్లో దిష్టిబొమ్మలు పెడితే.. మరికొందరు వింత వింత శబ్ధాలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తుంటారు. ఇలాంటి వింత వింత ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ రైతు తన పొలంలోకి అడవి జంతువులు రాకుండా ఉండేందుకు వినూత్న చర్యలు తీసుకున్నాడు. ఇతను చేసిన పని చూసి అంతా అవాక్కతువుతన్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ రైతు తన పొలంలోకి అడవి జంతువులు (wild animals) రాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అతను వివిధ రకాలుగా ఆలోచించి, చివరకు ఎవరూ చేయని విధంగా వింత నిర్ణయం తీసుకున్నాడు. అందరిలా దిష్టిబొమ్మలు పెట్టకుండా తానే స్వయంగా రంగంలోకి దిగాడు.

Viral Video: రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఇలా మాత్రం చేయొద్దు.. ఈమెకు ఏమైందో చూడండి..


రాత్రి వేళ పొలంలోకి తప్పెట తీసుకుని వెళ్లాడు. ఓ వ్యక్తి పొలంలో లైట్లు వేస్తుండగా.. సదరు రైతు తప్పెట కొడుతూ, (farmer beating drum in farm) గట్టిగా అరుస్తూ వింత వింత శబ్ధాలు చేస్తున్నాడు. ఈ శబ్ధాలు విన్నవారికి భయం పుట్టించేలా ఉన్నాయి. జంతువులు, మనుషులు కూడా రాత్రి వేళ ఈ పొలం సమీపానికి వెళ్లేందుకు కూడా భయపడేలా అరుస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Crocodile Attack: నటిస్తూ వేటాడడమంటే ఇదే.. ఈ మొసలి నిర్వాకమేంటో మీరే చూడండి..


‘‘వామ్మో.. ఈ శబ్ధాలు వింటే దయ్యాలు కూడా పారిపోతాయేమో’’.., ‘‘రాత్రివేళ ఎవరైనా అటు వెళ్తే హార్ట్ ఎటాక్ రావాల్సిందే’’.., ‘‘పెద్దాయన కాంతారావు సినిమాలు బాగా చూస్తున్నట్లు ఉన్నాడే’’.., ‘‘అడవి పందులన్నీ జడుసుకుని చస్తాయేమో’’.., ‘‘ఈ శబ్ధాలు కాంతార-2 సౌండ్స్‌లా ఉన్నాయి’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 60 వేలకు పైగా లైక్‌లు, 1.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కొంప కూల్చే ట్రిక్స్ అంటే ఇవే.. గ్యాస్ తక్కువగా ఉందని ఇతను చేసిన నిర్వాకమిదీ..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 26 , 2025 | 08:21 AM