Viral Video: కుందేలా మజాకా..! పట్టుకోవడానికి ప్రయత్నించిన కుక్కలకు చుక్కలు చూపించిందిగా..
ABN , Publish Date - Jan 26 , 2025 | 10:44 AM
ఆకలిలో ఉన్న రెండు కుక్కలకు ఓ కుందేలు కంటపడుతుంది. ఇంకేముందీ.. వెంటనే దాన్ని వెంబడిచేస్తాయి. కుక్కలు వెంటపడడం చూసి కుందేలు అలెర్ట్ అవుతుంది. మెరుపు వేగంతో పరుగెడుతూ కుక్కలకు దొరక్కుండా పారిపోతుంది. మరోవైపు కుక్కలు కూడా అంతే వేగంతో కుందేలును వెంటపడతాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

కుందేలు చూసేందుకు ఎంత అందంగా ఉంటుందో అవి పరుగెడుతుంటే కూడా అంతే అందంగా ఉంటాయి. చెంగు చెంగున ఎగురుతూ చూపరులను ఆకట్టుకుంటుంటాయి. అలాగే వాటికి ఏదైన ప్రమాదం ముంచుకొస్తుందని తెలిస్తే అత్యంత వేగంగా పరుగెడుతూ శత్రువును డైవర్ట్ చేసేస్తాయి. పరుగెత్తే కుందేళ్లను తరచూ చూస్తూనే ఉంటాం. అయితే మెరుపు వేగంతో పరుగెత్తే కుందేళ్లను చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి కుందేలుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పట్టుకోవడానికి ప్రయత్నించిన కుక్కలకు దొరక్కుండా ఓ కుందేలు పరుగందుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘కుందేలా మజాకా..!’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలిలో ఉన్న రెండు కుక్కలకు ఓ కుందేలు కంటపడుతుంది. ఇంకేముందీ.. వెంటనే (dogs chased the rabbit) దాన్ని వెంబడిచేస్తాయి. కుక్కలు వెంటపడడం చూసి కుందేలు అలెర్ట్ అవుతుంది. మెరుపు వేగంతో పరుగెడుతూ కుక్కలకు దొరక్కుండా పారిపోతుంది. మరోవైపు కుక్కలు కూడా అంతే వేగంతో కుందేలును వెంటపడతాయి.
Viral Video: కొంప కూల్చే ట్రిక్స్ అంటే ఇవే.. గ్యాస్ తక్కువగా ఉందని ఇతను చేసిన నిర్వాకమిదీ..
కుక్కలు దగ్గరికి రావడం చూసి కుందేలు చివరకు మరింత వేగాన్ని పెంచడమే కాకుండా అటూ, ఇటూ మలుపులు తిరుగుతూ కుక్కలను తికమకపెడుతుంది. ఇలా చూస్తుండగానే (rabbit ran away from the dogs) కుక్కలకు దొరక్కుండా పారిపోతుంది. కుందేలును చేరుకోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించిన కుక్కలకు చివరకు నిరాశే ఎదురవుతుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. పర్యాటకుల సమక్షంలోనే ఈ ఘటన జరగడంతో కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే జంతువులే కాదు మనుషులూ హడలిపోవాల్సిందే.. ఈ రైతు చేసిన పని చూస్తే..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కుందేలుకు భౌతిక శాస్త్రం బాగా తెలిసినట్లుంది’’.. అంటూ కొందరు, ‘‘అంతటి వేగాన్ని కూడా కెమెరా బంధించిన కెమెరామెన్ గ్రేట్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 35 వేలకు పైగా లైక్‌లు, 5. 46 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..