Share News

Viral Video: రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఇలా మాత్రం చేయొద్దు.. ఈమెకు ఏమైందో చూడండి..

ABN , Publish Date - Jan 25 , 2025 | 01:50 PM

ఓ మహిళ తన కుమార్తెను ఎత్తుకుని రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటుంది. ఇంతలో ఆమెకు ఫోన్ రావడంతో లిఫ్ట్ చేస్తుంది. అయితే ఫోన్‌లో మాట్లాడుతూ ఎదురుగా ఏం జరుగుతుందో కూడా చూసుకోకుండా వెళ్తుంటుంది. ఈ క్రమంలో ఓ చోట రోడ్డు మధ్యలో..

Viral Video: రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఇలా మాత్రం చేయొద్దు.. ఈమెకు ఏమైందో చూడండి..

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో పిల్లల మొదలుకొని పెద్దలు.. చివరకు వృద్ధుల వరకూ అంతా ఫోన్‌కు ఎడిక్ట్ అవుతున్నారు. నిత్యం ఫోన్‌లోనే గడుపుతూ బయట ప్రపంచానికి దూరమవుతున్నారు. కొందరైతే చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ఫోన్లలోనే మునిగిపోతున్నారు. ఈ క్రమంలో కొందరు అనూహ్య ప్రమాదాల్లో చిక్కుకుపోతున్నారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. పాపను ఎత్తుకుని, ఫోన్ మాట్లాడుతూ నడుస్తూ వెళ్తుండగా మధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన కుమార్తెను ఎత్తుకుని రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటుంది. ఇంతలో ఆమెకు ఫోన్ రావడంతో లిఫ్ట్ చేస్తుంది. అయితే ఫోన్‌లో మాట్లాడుతూ ఎదురుగా (woman talking on phone while walking) ఏం జరుగుతుందో కూడా చూసుకోకుండా వెళ్తుంటుంది. ఈ క్రమంలో ఓ చోట రోడ్డు మధ్యలో మ్యాన్‌హోల్ తెరచి ఉంటుంది. దాని పక్కనే ఓ సైన్ బోర్డు కూడా పెట్టి ఉంటారు.

Viral Video: అవి దంతాలా లేక ఇనుక కడ్డీలా.. ఈ బాలుడి విన్యాసం చూస్తే షాకవ్వాల్సిందే..


అయితే ఫోన్‌లో మాట్లాడుతూ వస్తున్న ఆమె.. అదేమీ పట్టించుకోకుండా వచ్చేస్తుంది. మ్యాన్‌హోల్ దగ్గరికి రాగానే ప్రమాదవశాత్తు (woman fell into manhole along with child) కాలు జారి అందులో పడిపోతుంది. మ్యాన్‌హోల్‌లో పడదిపోయిన కాసేపటికి చుట్టు పక్కల వారు పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. లోపలికి దిగి ముందుగా చిన్నారిని రక్షించి పైకి తీసుకొస్తారు. తర్వాత ఆమెను కూడా బయటికి తీసుకొస్తారు. ఈ ఘటనతో ఆమెతో పాటూ చిన్నారికీ గాయాలైనట్లు తెలుస్తోంది.

Viral Video: కొంప కూల్చే ట్రిక్స్ అంటే ఇవే.. గ్యాస్ తక్కువగా ఉందని ఇతను చేసిన నిర్వాకమిదీ..


అయితే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫోన్ మాయలో పడితే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ కొందరు, ‘‘ఈమె చేసిన తప్పునకు చిన్నారి కూడా బాధపడాల్సి వచ్చింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 800కి పైగా లైక్‌లు, 1.93 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Crocodile Attack: నటిస్తూ వేటాడడమంటే ఇదే.. ఈ మొసలి నిర్వాకమేంటో మీరే చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 25 , 2025 | 01:50 PM