Viral Video: ఎస్కలేటర్‌పై హృదయ విదారక ఘటన.. కొడుకును కాపాడిన తల్లి.. చూస్తుండగానే..
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:35 PM
ఓ మహిళ తన కొడుకును తీసుకుని పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌కు వెళ్తుంది. అయితే ఈ సందర్భంగా ఆమె ఎస్కరేటర్ ఎక్కుతుంది. అయితే దిగే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘అయ్యో పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

తల్లి మనసు ఎలా ఉంటుందో, పిల్లలపై ఎంత ప్రేమ కురిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునే తల్లి.. వారికి ప్రాణాపాయం వస్తే.. తమ ప్రాణాలను అడ్డుపెట్టి మరీ రక్షించుకుంటుంది. అందుకే తల్లికి మించిన దైవం లేదు.. అని పెద్దలు అంటూ ఉంటారు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఓ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ తల్లి తన కొడుకుతో కలిసి ఎస్కలేటర్‌పై వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన కొడుకును తీసుకుని పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌కు వెళ్తుంది. అయితే ఈ సందర్భంగా ఆమె ఎస్కరేటర్ ఎక్కుతుంది. అయితే దిగే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎస్కలేటర్ (Escalator) దిగే సమయంలో కొడునుకును ఎత్తుకుని ఎంతో జాగ్రత్తగా దిగుతుంది.
Viral Video: ఫోన్లలో బిజీగా ఉన్న ప్రయాణికులు.. సడన్‌గా లోపలికి దూరిన ఎద్దు.. చివరకు..
అయితే ఈ క్రమంలో కింద ఉన్న ఇనుప రేకులు కూలిపోతాయి. దీంతో ఆమె ఒక్కసారిగా (woman stuck in an escalator) రంధ్రంలో ఇరుక్కుపోతుంది. అయితే తన పిల్లాడిని మాత్రం బయటపడేస్తుంది. అక్కడే ఉన్న సిబ్బంది పిల్లాడిని లాగి పక్కకు తీసుకుంటారు. అయితే ఆమెను కూడా కాపాడాలని ప్రయత్నించగా.. అంతలోనే ఆమె రంధ్రంలోని బెల్టులో ఇరుక్కుని లోపలికి వెళ్లిపోతుంది. దీంతో సిబ్బంది పరుగెత్తుకుంటూ వెళ్లి చివరకు ఎస్కలేటర్‌ను ఆపేస్తారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.
Woman Viral Video: పీక్స్‌కు వెళ్లిన ఫోన్ పిచ్చి.. చెత్త అనుకుని పిల్లాడిని ఏం చేసిందో చూడండి..
కొన్నేళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఘటన చూస్తుంటే ఇకపై ఎస్కలేటర్ ఎక్కాలంటేనే భయపడేలా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 25 వేలకు పైగా లైక్‌లు, 4.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: చోరీ చేయడంలో పీజీ చేసినట్టున్నాడే.. ఎలా కొట్టేశాడో చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..