Share News

Viral Video: ఇందుకే నాన్నను రియల్ హీరో అనేది.. కిండపడుతున్న బిడ్డను ఎలా పట్టుకున్నాడో చూస్తే..

ABN , Publish Date - Feb 11 , 2025 | 09:16 PM

ఓ తండ్రి తన పాపను ఎత్తుకుని ఇంటి గేటు వద్దకు వెళ్తాడు. తనకు వచ్చిన పార్సిల్‌ తీసుకుని, మళ్లీ గేటు మూసి ఇంట్లోకి వెళ్తుంటాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇంట్లోకి వెళ్లే సమయంలో ఉన్నట్టుండి..

Viral Video: ఇందుకే నాన్నను రియల్ హీరో అనేది.. కిండపడుతున్న బిడ్డను ఎలా పట్టుకున్నాడో చూస్తే..

ఏ కుటుంబంలో అయినా పిల్లలకు వారి నాన్నే సూపర్ హీరో. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి బాగోగుల కోసం తన సుఖాలను సైతం వదులకుంటాడు. ఇక తన పిల్లలకు ఎలాంటి కష్టమొచ్చినా తన ప్రాణాలను ఫణంగా పెట్టి రక్షించుకుంటాడు. అందుకే పిల్లలను తమ నాన్నను హీరోలాగా పిలుచుకుంటారు. ఇందుకు నిదర్శంగా మన కళ్ల మందు అనేక సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ తండ్రి పడిపోతున్న తన పాపను ఎంతో చాకచక్యంగా పట్టుకోవడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ తండ్రి తన పాపను ఎత్తుకుని ఇంటి గేటు వద్దకు వెళ్తాడు. తనకు వచ్చిన పార్సిల్‌ తీసుకుని, మళ్లీ గేటు మూసి ఇంట్లోకి వెళ్తుంటాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇంట్లోకి వెళ్లే సమయంలో ఉన్నట్టుండి తన పాప జారికిందపడుతుంటుంది.

Viral Video: వీడెవండీ బాబోయ్.. జనరల్ బోగీని కాస్తా స్లీపర్‌గా ఎలా మార్చాడో చూడండి..


అయితే తన చేతుల్లోంచి పాప ఇలా జరిపోగానే.. క్షణాల్లోనే స్పందించి పట్టుకుంటాడు. ఇలా పాప కిందపడక ముందే గాల్లోనే ఎంతో (father saves falling baby) చాకచక్యంగా పట్టుకుని మళ్లీ భుజాలపై పెట్టుకుని ఇంట్లో్కి తీసుకెళ్తాడు. ఈ క్రమంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా.. పాప కిందపడిపోయి గాయాలయ్యేవి. అయితే వెంటనే అలెర్ట్ అయి పాపను రక్షించిన ఈ తండ్రిని చూసి అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి తండ్రి ఉంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ప్రశంసిస్తున్నారు.

Viral Video: టీచర్ మనసు దోచుకున్న విద్యార్థి.. పరీక్ష పేపర్‌ చివర్లో రాసింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రపంచంలో తండ్రి కంటే పిల్లల్ని ఎవరూ సురక్షితంగా ఉంచలేరు’’.. అంటూ కొందరు, ‘‘పాపను కాపాడిన విధానం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షలకు పైగా లైక్‌లు, 4.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Woman Viral Video: పీక్స్‌కు వెళ్లిన ఫోన్ పిచ్చి.. చెత్త అనుకుని పిల్లాడిని ఏం చేసిందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 11 , 2025 | 09:16 PM