AP Elections 2024: మాజీ మంత్రి కన్నా కార్యాలయంపై వైసీపీ మూకల దాడి..
ABN , Publish Date - May 29 , 2024 | 11:01 AM
సత్తెనపల్లి(Sathenapalli)లో మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana) కార్యాలయం వద్ద అర్ధరాత్రి యువకులు హల్చల్ చేశారు. మద్యం మత్తులో ఆఫీస్ వాచ్‌మెన్(Watchman)పై దాడికి పాల్పడ్డారు. కార్యాలయం తగలపెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. దాడితో భయపడిన వాచ్‌మెన్ కొండలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పల్నాడు: సత్తెనపల్లి(Sathenapalli)లో మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana) కార్యాలయం వద్ద అర్ధరాత్రి యువకులు హల్చల్ చేశారు. మద్యం మత్తులో ఆఫీస్ వాచ్‌మెన్(Watchman)పై దాడికి పాల్పడ్డారు. కార్యాలయం తగలపెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. దాడితో భయపడిన వాచ్‌మెన్ కొండలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ వైసీపీ శ్రేణులు మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణపై రాళ్లు రువ్వారు. ముప్పాళ్ల మండలం తొండపిలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారంటీ’ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలోనూ వీధి దీపాలు ఆర్పి మరీ ఇళ్ల పైనుంచి రాళ్లు విసిరి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన వ్యక్తిగత సహాయకుడు సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రస్తుతం దాడి చేసిన వ్యక్తులను వైసీపీ మూకలుగానే టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ శ్రేణులు ప్రతిపక్షాలను బతకనిచ్చేలా లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులను చూస్తుంటే యుద్ధ వాతావరణం తలపిస్తోందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నాటి నుంచి సామాన్య ప్రజలు, ప్రతిపక్షాలు, అధికార యంత్రాగాలపైనా దాడులు, బెదిరింపులకు పాల్పడుతూ వీరంగం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పలు జిల్లాల్లో ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం సీరియస్ అయినా.. వైసీపీ మూకల్లో మాత్రం మార్పు రాలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఈ రావణకాష్టకు ముగింపు దొరుకుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
AP Politics: మాచర్లలో 52మందిపై రౌడీషీట్ ఓపెన్.. ఎందుకంటే..?
AP Politics: మళ్లీ వెలుగుచూసిన వైసీపీ మూకల వికృత చేష్టలు..