Share News

Different Routes To Prayag Raj : మహాకుంభమేళాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. ఇలా చేయండి..

ABN , Publish Date - Jan 23 , 2025 | 08:58 PM

మహాకుంభమేళాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? బస్సు, రైలు లేదా కారులాంటి వాహనాల్లో ఏది బెటర్ అని అర్థం కావడం లేదా ? అక్కడకు ఏయే మార్గాల్లో వెళ్లాలి. ఎన్ని రోజుల ట్రిప్‌కు ఎంత ఖర్చవుతుంది. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు ఏంటి అనే సందేహాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

Different Routes To Prayag Raj : మహాకుంభమేళాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. ఇలా చేయండి..
Different Ways to go to Maha Kumbha Mela

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‍‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఇప్పటివరకూ దాదాపు 9.24 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఫిబ్రవరి 26 వరకూ జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో షెడ్యూల్ ప్రకారం 4 'షాహీ స్నాన్'లు జరగాల్సి ఉంది. 144 ఏళ్ల తర్వాత వచ్చిన కుంభమేళా కావడంతో అందరూ త్రివేణి సంగమానికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడకు ఏయే మార్గాల్లో వెళ్లాలి. ఎన్ని రోజుల ట్రిప్‌కు ఎంత ఖర్చవుతుంది. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు ఏంటి? బస్సు, రైలు లేదా కారులాంటి వాహనాల్లో ఏది బెటర్ అనే సందేహాల గురించి ఇక్కడ తెలుసుకోండి.


విమాన సర్వీసులు :

విజయవాడ లేదా గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రయాగ్‍‌రాజ్‌కు 5.30గం.లు. టికెట్ ధర- రూ.6761-19,903/-

విశాఖపట్నం విమానాశ్రయం నుంచి 4.25గం.లు. టికెట్ ధర- రూ.8620-15,736/-

రాజమండ్రి విమానాశ్రయం నుంచి 4.22గం.లు. టికెట్ ధర- రూ.7,190-21,819/-

కారు : కారులో ద్వారా దాదాపు 17గం.ల సమయం పడుతుంది. దూరం 1,124.9 కి.మీ. పెట్రోల్ ఖర్చులు రూ.12000-16000/-లు కావచ్చు.


బస్సు వివరాలు :

ఏపీ, తెలంగాణల నుంచి ప్రయాగ్‍‌రాజ్‌లోని మహాకుంభమేళాకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి.

APSRTC, TSRTC లు రెండు కార్పొరేషన్లు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల నుండి ప్రత్యేక బస్సులను నడుపుతున్నాయి.

ఛార్జీలు : ₹1,500 - ₹3,000 (బస్సు రకం మరియు రూట్‌ని బట్టి).

బుకింగ్ : APSRTC మరియు TSRTC వెబ్‌సైట్‌లు లేదా మొబైల్ యాప్‌లు.

ప్రైవేటు బస్సులు :

టికెట్ ధరలు : హైదరాబాద్ నుంచి ప్రయాగ్‍‌రాజ్‌కు కనీస ధర రూ.2100 నుంచి గరిష్ఠంగా రూ.8000 వరకూ ఉంటుంది.

బస్ టైమింగ్స్ : హైదరాబాద్ నుంచి ఉదయం 5గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ప్రతిరోజూ 26 బస్సులు అందుబాటులో ఉంటాయి. బస్సులో ప్రయాగ్‍‌రాజ్ చేరుకునేందుకు 26 నుంచి 30 గంటల సమయం పడుతుంది.

బస్సు ఆపరేటర్లు : ట్రావెల్ పాయింట్ వరల్డ్ ఎల్‌ఎల్‌పీ, అభా ట్రావెల్స్, ఫాస్ట్ ట్రాక్ టూర్స్ అండ్ ట్రావెల్స్, దీపక్ బస్ సర్వీసెస్, జెజె యాత్ర ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు ప్రయాగ్‍‌రాజ్‌కు నిరంతరం బస్సులు నడుపుతున్నాయి.

బుకింగ్, క్యాన్సలేషన్ : రెడ్ బస్, అభిబస్ లాంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు, టైమింగ్స్ మారుతూ ఉండే అవకాశముంది.


ఐఆర్‍‌సీటీసీ ప్రత్యేక రైళ్లు, ప్యాకేజీల వివరాలు :

మహా కుంభమేళా సందర్భంగా ఐఆర్‍‌సీటీసీ ఏపీ, తెలంగాణల నుంచి ప్రత్యేక ప్యాకేజీ టూర్ రైళ్లు నడుపుతోంది.

1. మహా కుంభ్ స్పెషల్ బై భరత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ : వచ్చేనెల 5 నుంచి 13వ తేదీ వరకు విజయవాడ మీదుగా వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్య మధ్య ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది.ఈ ప్రత్యేక రైలు ఫిబ్రవరి 5న చెన్నైలోని తిరునల్వేలిలో బయలుదేరి ఫిబ్రవరి 6న విజయవాడ చేరుకుంటుంది. ఫిబ్రవరి 10వ తేదీ తిరిగి ప్రయాగ్‍‌రాజ్‌ నుంచి బయలుదేరుతుంది. పెద్దలకు స్లీపర్‌ క్లాస్‌కు రూ.26,850, థర్డ్‌ ఏసీలో రూ.38,470, సెకండ్‌ ఏసీకి రూ.47,900 . పిల్లల కోసం ఎకానమీ(స్లీపర్): రూ.25,810, స్టాండర్డ్(3 AC): రూ.37,250, కంఫర్ట్ (2 AC): రూ.46,450 టికెట్ల బుకింగ్, ఇతర వివరాల కోసం 90031 40680, 82879 31964 ఫోన్ నంబర్లలో సంప్రదించండి. పర్యటన ప్రయాణం: తిరునల్వేలి - వారణాసి - ప్రయాగ్‍‌రాజ్‌- అయోధ్య - తిరునల్వేలి

బోర్డింగ్ మరియు డీబోర్డింగ్ స్టేషన్లు: తిరునల్వేలి - తేన్ కాశీ Jn - రాజపాళయం Jn - శివకాశి Jn - విరుదునగర్ Jn - మధురై - దిండిగల్ - Trichy Jn - తంజావూరు Jn - కుంభకోణం Jn - మయిలాడుతురై Jn - చిదంబరం - Tripadripuliyur - E-Chinengalpatriyur - Chinengalpatrio Jt గూడూరు - విజయవాడ - వరంగల్ - నాగ్‌పూర్ (NGP) - జబల్‌పూర్ (JBP) - వారణాసి (BSBS) - ప్రయాగ్‌రాజ్ (PYGS) - అయోధ్య కాంట్ (AYC) - చెన్నై ఎగ్మోర్ (MS) - తాంబరం (TBM) - చెంగల్పట్టు (CGL) - విల్లుపురం ( VM) -చిదంబరం (CDM) - తిరుచ్చి (TPJ) - మండపం(MMM) - మధురై - విరుదునగర్ - శివకాశి - రాజపాళయం - తెన్కాసి - తిరునల్వేలి

సీట్ల సంఖ్య: 716 ( స్టాండర్డ్ - 460 , ఎకానమీ - 206 & కంఫర్ట్ - 50)

గమనిక : సింగిల్‌గా బుక్ చేసుకున్న ప్రయాణీకుడు ఇతర బుకింగ్‌లతో షేరింగ్ ప్రాతిపదికన ఇతర ప్రయాణీకులతో ఆక్యుపెన్సీని పంచుకోవాలి. భారతీయ రైల్వేలు భారత్ గౌరవ్ రైలు పథకం కింద సుమారు 33% రాయితీని అందిస్తోంది. బయలుదేరడానికి 03 - 04 రోజుల ముందు సీటింగ్ ఖరారు చేయబడుతుంది. లోయర్ బెర్త్ కేటాయింపు హామీ లేదు.


2. మహా కుంభ పుణ్య క్షేత్ర యాత్ర ప్యాకేజీ : ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ నుంచి కుంభమేళాకు ఐఆర్‍‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ రైలు ఉంటుంది. వరంగల్, విజయవాడ, ఖమ్మం మరియు వైజాగ్ మీదుగా ఈ రైలు వెళుతుంది. ఈ ప్యాకేజీ ద్వారా రోడ్డు రవాణా ద్వారా అయోధ్య బల్ రామ్ మందిరం, కాశీ విశ్వనాథ్ & కాశీ విశాలాక్షి దేవాలయాలు సందర్శించవచ్చు. మా ప్యాకేజీలో రైలు, రోడ్డు రవాణా, ఆహారం, వసతి, ఇతర సేవలు ఉన్నాయి. ఫిబ్రవరి 22 వరకూ ఈ టూర్ ఉంటుంది. వ్యవధి : 07 రాత్రులు/08 రోజులు, పర్యటన తేదీ : 15.02.2025, పర్యటన ప్రయాణం : వారణాసి - అయోధ్య - ప్రయాగ్‌రాజ్, సీట్ల సంఖ్య : 460(SL: 202, 3AC: 206, 2AC: 52)

బోర్డింగ్ / డి బోర్డింగ్ స్టేషన్లు:

సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట్, తుని, దువ్వాడ, పెందురిటి, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఛత్రపూర్, కుర్ధా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్ మరియు బాలాసోర్.

టికెట్ ధర :

ఎకానమీ క్లాస్ : పెద్దలకు రూ.23,035, పిల్లలకు (5-11 ఏళ్లు) రూ.22,140లు.

స్టాండర్డ్ క్లాస్ :పెద్దవాళ్లకు రూ. 32105, పిల్లలకు (5-11 ఏళ్లు) రూ.31055

కంఫర్ట్ క్లాస్ : పెద్దవాళ్లకు రూ.39558, పిల్లలకు (5-11 ఏళ్లు) రూ.38300


3. ఫిబ్రవరి 15న హైదరాబాద్ విజయవాడ వైజాగ్ మీదుగా కుంభమేళా ప్యాకేజీ ఉంది. వ్యవధి : 07 రాత్రులు/08 రోజుల, పర్యటన తేదీ : 15.02.2025, పర్యటన ప్రయాణం : వారణాసి - అయోధ్య - ప్రయాగ్‌రాజ్, సీట్ల సంఖ్య : 460 (SL: 202, 3AC: 206, 2AC: 52)

బోర్డింగ్ / డి బోర్డింగ్ స్టేషన్లు:

సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట్, తుని, దువ్వాడ, పెందురిటి, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఛత్రపూర్, కుర్ధా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్ మరియు బాలాసోర్.

టికెట్ ధర :

ఎకానమీ క్లాస్ : పెద్దలకు రూ.23,035, పిల్లలకు (5-11 ఏళ్లు) రూ.22,140లు.

స్టాండర్డ్ క్లాస్ : పెద్దవాళ్లకు రూ. 32105, పిల్లలకు (5-11 ఏళ్లు) రూ.31055

కంఫర్ట్ క్లాస్ : పెద్దవాళ్లకు రూ.39558, పిల్లలకు (5-11 ఏళ్లు) రూ.38300


4. వారణాసి-కాశీ-ప్రయాగ్‌రాజ్ టూర్ ప్యాకేజీ : హైదరాబాద్ నుండి కాజీపేట-రామగుండం-నాగ్‌పూర్ మీదుగా ప్రతి శుక్రవారం, ఆదివారం ఈ రైలు ఉంటుంది. పర్యటన వ్యవధి- 5 రాత్రులు, 6 పగళ్లు. వారణాసి, ప్రయాగ్‌రాజ్ సందర్శించవచ్చు.

కంఫర్ట్ (2 AC) :

సింగిల్ రూ.48730/-, ఇద్దరికి రూ.31610/-, ముగ్గురికి రూ. 29390/-, చైల్డ్ విత్ బెడ్ (5-11 సంవత్సరాలు) రూ.22890/-, చైల్డ్ విత్ అవుట్ బెడ్ (5-11 సంవత్సరాలు) రూ.14650/-

స్టాండర్డ్(3 AC):

సింగిల్ రూ.45700/-, ఇద్దరికి రూ.28570/-, ముగ్గురికి రూ. 26360/-, చైల్డ్ విత్ బెడ్ (5-11 సంవత్సరాలు) రూ.19860/-, చైల్డ్ విత్ అవుట్ బెడ్ (5-11 సంవత్సరాలు) రూ.11620/-

మొత్తం సీట్ల కోటా : స్లీపర్ నాన్ AC – 12, 3AC - 06


తెలంగాణ నుండి రైళ్లు

సికింద్రాబాద్ నుండి ఫాఫామౌ : రైలు 04526, జనవరి 25, ఫిబ్రవరి 8, 18, 22న బయలుదేరుతుంది

-సికింద్రాబాద్ నుండి కుంభమేళా : వారణాసి, అయోధ్య మరియు ప్రయాగ్‌రాజ్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను కవర్ చేసే ప్రత్యేక రైలు ఫిబ్రవరి 15న బయలుదేరి ఫిబ్రవరి 22న తిరిగి వస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్ నుండి రైళ్లు

విశాఖపట్నం నుండి ఫాఫామౌ : రైలు 08503, వివిధ తేదీలలో బయలుదేరుతుంది

విజయవాడ నుండి ఫాఫామౌ : రైలు 07487, వివిధ తేదీలలో బయలుదేరుతుంది

తిరుపతి నుండి ఫాఫామౌ : రైలు 07483, వివిధ తేదీలలో బయలుదేరుతుంది


రైలు నెం. 7701: జనవరి 24న గుంటూరు నుంచి రాత్రి 23.00 గం.లకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 17:15 గంటలకు అజంగఢ్ చేరుకుంటుంది.

రైలు నెం. 7702: జనవరి 26న అజంఘర్ నుంచి రాత్రి19:45 గం.లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09:00 గంటలకు గుంటూరు చేరుకుంటుంది.

రైలు 7719: గుంటూరు నుండి జనవరి 25న 14:20కి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 09:00 గంటలకు గయ చేరుకుంటుంది.

రైలు 7720: జనవరి 27న 14:15 గంటలకు గయలో బయలుదేరి మరుసటి రోజు 04:00 గంటలకు గుంటూరు చేరుకుంటుంది.

రైలు 7722: జనవరి 24న పాట్నా నుండి నాందేడ్‌కు తిరిగి వస్తుంది, 15:30కి బయలుదేరి 04:30కి చేరుకుంటుంది.

రైలు 7725: కాచిగూడ నుండి పాట్నాకు జనవరి 25న 16:45కి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10:30కి చేరుకుంటుంది.

రైలు 7726: జనవరి 27న పాట్నా నుండి కాచిగూడకు తిరిగి, 11:30కి బయలుదేరి మరుసటి రోజు 07:00కి చేరుకుంటుంది.

గమనిక : సంబంధిత సైట్ల్ ఆధారంగా ఈ సమాచారం సేకరించడమైనది. రైళ్లు, బస్సు టికెట్ ధరలు, బయలుదేరే తేదీల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చు.

Updated Date - Jan 23 , 2025 | 09:05 PM