ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్
ABN, First Publish Date - 2021-02-21T05:43:16+05:30
జిల్లాలో నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ముత్యాలరాజు చెప్పారు.
ఏలూరు, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ముత్యాలరాజు చెప్పారు. శనివారం కలెక్టరేట్‌కు వచ్చిన ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు వి.నాగిరెడ్డిని ఆయన ఆహ్వానించారు. ఈనెల 21న ఏలూరు డివిజన్‌లోని 12 మండలాల్లో జరిగే నాలుగో విడత ఎన్నికల కోసం తీసుకున్న చర్యలను పరిశీలకుడు నాగిరెడ్డికి ఆయన వివరించారు.నాలుగో విడత ఎన్నికల నిర్వహణ నిమిత్తం 200 బస్సులను ఏర్పాటు చేశామని కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎన్నికల సిబ్బందిని వారికి కేటా యించిన మండలాలకు బస్సుల ద్వారా పంపామని ఆయన చెప్పారు. ఎన్నికల అనంతరం తిరిగి అవే బస్సుల్లో గమ్యానికి చేరుస్తామని తెలిపారు.
ప్రజలు పట్ల మర్యాదగా నడుచుకోండి : డీఐజీ
ఏలూరు క్రైం, ఫిబ్రవరి 20 : ప్రజలు పట్ల పోలీసులు మర్యాదగా నడుచుకోవాలని ఏలూరు రేంజ్ డీఐజీ కెవీ మోహనరావు సూచించారు. నాలుగవ విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో రెవెన్యూ డివిజన్‌లోని పోలీస్ సిబ్బందితో డీఐజీ కెవీ మోహనరావు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రతి ఒక్కరు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా రక్షణ కల్పించాలని, కొవిడ్ నిబంధనలు కూడా పాటించాలని సూచించారు. ఓటర్లు మినహా పోలింగ్ కేంద్రాలకు, కౌంటింగ్ కేంద్రాలకు అనుమతి ఉన్నవారిని మాత్రమే పంపించాలని సూచించారు. ఓటు హక్కు వినియోగిం చుకోవడానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు పోలీసులు సహాయపడాలన్నారు.