సిక్కోలు కుర్రాడి జాతీయ రికార్డు
ABN, First Publish Date - 2021-02-09T07:53:14+05:30
జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో తెలుగు కుర్రాడు లావేటి యశ్వంత్ కుమార్ కొత్త రికార్డు నమోదు చేశాడు. సోమవారం ముగిసిన బాలుర అండర్-20 హర్డిల్స్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో తెలుగు కుర్రాడు లావేటి యశ్వంత్ కుమార్ కొత్త రికార్డు నమోదు చేశాడు. సోమవారం ముగిసిన బాలుర అండర్-20 హర్డిల్స్ 110 మీ. రేసును యశ్వంత్ 13.92 సెకన్లలో పూర్తిచేసి సరికొత్త రికార్డుతో స్వర్ణం దక్కించుకున్నాడు. 2010లో 13.93 సెకన్లతో సురేందర్ (తమిళనాడు) నెలకొల్పిన రికార్డును యశ్వంత్ అధిగమించాడు. శ్రీకాకుళం జిల్లా రాజాంలోని అంబకండి గ్రామం యశ్వంత్ స్వస్థలం. బాలికల అండర్-18 హర్డిల్స్ 100 మీ. రేసును తెలంగాణ అమ్మాయి నందిని 13.83 సె. పూర్తి చేసి స్వర్ణం సాధించింది. బాలుర అండర్-16 లాంగ్‌జం్‌పలో కె.ప్రణయ్ 6.68 మీటర్లు లంఘించి కాంస్య పతకం నెగ్గాడు.