గ్రామీణ వికాస్ బ్యాంకులో అగ్నిప్రమాదం
ABN, First Publish Date - 2021-01-30T13:27:29+05:30
జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో అగ్నిప్రమాదం ప్రమాదం జరిగింది. పటాన్‌చెరు మండలంలోని మండల్ భానూర్ గ్రామంలో గల
సంగారెడ్డి: జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. పటాన్‌చెరు మండలంలోని మండల్ భానూర్ గ్రామంలో గల గ్రామీణ వికాస్ బ్యాంకులో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం దాదాపు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో జరిగినట్లు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం కావచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. బ్యాంక్ అధికారులు వస్తేగాని నష్టం వివరాలు తెలిసే అవకాశం లేదు. ఏది ఏమైనా బ్యాంకులో అగ్నిప్రమాదం గ్రామంలో కలకలం రేపింది.