ప్రగతిపథంలో కరీంనగర్ నగరపాలక సంస్థ
ABN, First Publish Date - 2021-01-30T06:10:14+05:30
నగరపాలక సంస్థను ప్రగతి పథంలో నడిపిస్తున్నామని మంత్రి గంగులకమలాకర్ అన్నారు.
అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాం
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
నగరపాలక సంస్థ ప్రగతి నివేదిక పుస్తకావిష్కరణ
కరీంనగర్ రూరల్, జనవరి 29: నగరపాలక సంస్థను ప్రగతి పథంలో నడిపిస్తున్నామని మంత్రి గంగులకమలాకర్ అన్నారు. శుక్రవారం సీతా రాంపూర్ 21వడివిజన్‌లో ఆయన ఓపెన్ జిమ్‌కు శంకుస్థాపన చేశారు. అలాగే నగరపాలక సంస్థ ప్రగతినివేదిక పుస్తకాన్ని మేయర్ సునీల్‌రావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పాలకవర్గం ఏర్పడి సంవత్సరం గడిచిందన్నారు. ఆరు సంవత్సరాలలో నగరపాలక సంస్థలో ఎన్నోఅభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. నగరవ్యాప్తంగా 3.60కోట్లతో 30ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశామన్నారు.
మేయర్ సునీల్‌రావు మాట్లాడుతూ.. సీఎంఅస్యూ రెన్స్ నిధులు, వివిధగ్రాంట్లతో నగర రూపురేఖలు మార్చుతున్నామన్నారు. అవినీతికి తావులేకుండా, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం గోశాలను సందర్శించి గోమాతలకు గడ్డి తినిపించారు.
కార్యక్రమంలో డిప్యూటీమేయర్ చల్లా స్వరూపారాణి, కమిషనర్ వల్లూరిక్రాంతి, కార్పొరే టర్లు జంగిలిసాగర్,తోటరాములు, బోనాల శ్రీకాంత్, గంటకళ్యాణి, గుగ్గిళ్లజయశ్రీ, భూమాగౌడ్, ఐలేందర్ యాదవ్, తుల బాలయ్య, బుచ్చి రెడ్డి, ఎస్‌ఈ కృషా ్ణరావు, ఈఈ రామన్ పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయం..
కరీంనగర్ రూరల్: ప్రజల ఆరోగ్యపరిరక్షణే ప్రభు త్వధ్యేయమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కొత్తపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో కొను గోలుచేసిన వాహనాలను మున్సిపల్‌చైర్మన్ రుద్ర రాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. కొత్తపల్లి మున్సిపాలిటీగా మారి సంవత్సరం గడిచిందన్నారు. ఇప్పటివరకు 1.35కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి మంజూర య్యాయన్నారు. అదనపుకలెక్టర్ నర్సింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, వార్డుసభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.