మంత్రి ఇంద్రకరణ్ రాజకీయ సన్యాసం తీసుకోవడం మేలు: ఎంపీ అరవింద్
ABN , First Publish Date - 2021-02-20T19:23:57+05:30 IST
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి
నిర్మల్: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి ఇంద్రకరణ్ రాజకీయ సన్యాసం తీసుకుని ఇంట్లో ఉండిపోవడం మేలు అని హితవుపలికారు. శనివారం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా టీఆర్‌ఎస్ నేతల భూకబ్జాలు, బెదిరింపులు బయటపడుతున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ 30 ఏళ్ల అనుభవం ఉన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలను కుక్కలతో పోల్చడం సిగ్గు చేటని విమర్శించారు. మంత్రి స్వప్రయోజనాల కోసమే కలెక్టరేట్‌ను దూరంగా నిర్మిస్తున్నారన్నారు. వయస్సులో చిన్నవాడైన కేసీఆర్ కాళ్ళు మొక్కిన రోజే ఇంద్రకరణ్ రెడ్డి ఆత్మగౌరవం చచ్చి పోయిందని ఎంపీ అన్నారు. నిర్మల్‌లో మంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న భూ కబ్జాలపై రాబోయే ప్రభుత్వం ఎంక్వైరీ చేసి జప్తు చేస్తుందని స్పష్టం చేశారు. రోహింగ్యా ముస్లింలకు పదుల సంఖ్యలో పాస్ పోర్టులు ఇచ్చారన్నారు. భైంసాలో హిందువుల ఇళ్ళు తగలబెడితే మంత్రి కనీసం స్పందించలేదని మండిపడ్డారు. రామమందిరానికి స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తుంటే జీర్ణించుకోలేని పార్టీ మీది అని వ్యాఖ్యానించారు. 4 వందల కోట్ల ప్రజాధనంతో బర్త్ డే చేసుకున్న ఘనత కేసీఆర్‌ది అని అన్నారు. ఫామ్ హౌజ్‌లోనే పర్మినెంట్‌గా ఉండే రోజులు రాబోతున్నాయని ఎంపీ అరవింద్ హెచ్చరించారు.