క్యాలీఫ్లవర్ పనీర్ కోఫ్తా
ABN, First Publish Date - 2021-03-13T17:26:25+05:30
కోఫ్తా కోసం : క్యాలీఫ్లవర్ - ఒకటి, పనీర్ ముక్కలు - అరకప్పు, బంగాళదుంపలు - నాలుగు, కార్న్‌ఫ్లోర్ - మూడు టేబుల్‌స్పూన్లు, కారం - ఒకటేబుల్‌స్పూన్, ధనియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్, జీలకర్రపొడి - ఒక టీస్పూన్, గరంమసాల - ఒక టీస్పూన్, ఉప్పు - తగినంత.
కావలసినవి: కోఫ్తా కోసం : క్యాలీఫ్లవర్ - ఒకటి, పనీర్ ముక్కలు - అరకప్పు, బంగాళదుంపలు - నాలుగు, కార్న్‌ఫ్లోర్ - మూడు టేబుల్‌స్పూన్లు, కారం - ఒకటేబుల్‌స్పూన్, ధనియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్, జీలకర్రపొడి - ఒక టీస్పూన్, గరంమసాల - ఒక టీస్పూన్, ఉప్పు - తగినంత.
కర్రీ కోసం : ఉల్లిపాయలు - రెండు, టొమాటోలు - నాలుగు, వాము - ఒక టీస్పూన్, కారం - ఒకటిన్నర టేబుల్‌స్పూన్, గరంమసాలా - ఒక టీస్పూన్, ధనియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు - రుచికి తగినంత, నూనె - ఒక టేబుల్‌స్పూన్, క్రీమ్ - కొద్దిగా, కొత్తిమీర - ఒకకట్ట.
తయారీ విధానం: క్యాలీఫ్లవర్‌ను ముక్కలుగా కట్ చేసి ఉప్పు వేసి మరిగించిన నీళ్లలో వేయాలి. మూడు నాలుగు నిమిషాల పాటు వేడి నీళ్లలో ఉంచి తరువాత పొడి టవల్ వేసి పెట్టుకున్న మరో పాత్రలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యాలీఫ్లవర్‌లు డ్రై అవుతాయి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి క్యాలీఫ్లవర్ ముక్కలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా కాసేపు వేగించుకుంటే సరిపోతుంది. అలా వేగించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను ఒక పాత్రలోకి తీసుకుని అందులో పనీర్ ముక్కలు వేయాలి. బంగాళదుంపల గుజ్జు, కార్న్‌ఫ్లోర్‌తో పాటు ఉల్లిపాయలు, టొమాటోలు, వాము, గరంమసాలా, ధనియాల పొడి, తగినంత కారం, ఉప్పు, క్రీమ్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న కోఫ్తాలుగా చేసుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక కోఫ్తాలను వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించి తీసుకోవాలి. కర్రీ తయారీ కోసం పాన్‌లో కాస్త నూనె వేసి వేడి అయ్యాక వాము, ఉల్లిపాయలు వేసి వేగించాలి. టొమాటో ప్యూరీ వేసుకోవాలి. కారం, గరంమసాలా, ధనియాల పొడి వేసి, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. చివరగా క్రీమ్ వేసి కలుపుకోవాలి. వేగించి పెట్టుకున్న కోఫ్తాలతో కలుపుకోవాలి. చిన్నమంటపై కాసేపు ఉంచి దింపుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.