ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కేశిరాజు వంశస్థుల ఆత్మీయ సమ్మేళనం

ABN, First Publish Date - 2022-12-24T22:16:22+05:30

Rajamundry: కేశిరాజు వంశస్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని రాజమహేంద్రవరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. గజల్ గాయకుడు డా.గజల్ శ్రీనివాస్ కేశిరాజు సంకల్పం మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కేశిరాజు రాజ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Rajamundry: కేశిరాజు వంశస్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని రాజమహేంద్రవరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. గజల్ గాయకుడు డా.గజల్ శ్రీనివాస్ కేశిరాజు సంకల్పం మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కేశిరాజు రాజ్ కుమార్ తెలిపారు. తపోవన్ ఆశ్రమం, తుని పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి మహా స్వామి (దివ్య శృంగేరి అనుబంధ పీఠం) సమక్షంలో కేశిరాజు వంశ కులదేవత కామేశ్వరీ దేవికి పూజ, లక్ష్మీ గణపతి హోమం, గోపూజ, తులసి పూజ నిర్వహించి, 65 సంవత్సరాలు పై‌బడిన పెద్దలను సత్కరించినట్లు రాజ్ కుమార్ తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో దేశ, విదేశాల నుంచి సుమారు 200 కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయని, గత వందేళ్లలో కేశిరాజు వంశంలో ఈ తరహా కార్యక్రమం జరగలేదని వంశ పెద్దలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, కేశిరాజు వంశోద్ధారకులు, సంస్కృత పండితులు, ఆచార్యులు కేశిరాజు నృసింహ అప్పారావు, ప్రముఖ గణిత శాస్త్ర పరిశోధకులు కేశిరాజు సత్యనారాయణ మూర్తి, ప్రముఖ ఇంజినీర్ కేశిరాజు గౌరీశంకర్, రవి చంద్రకుమార్, వెంకట్రాజు, తల్లాప్రగడ మాధవి, కేశిరాజు రామ్ ప్రసాద్ జమలాపురపు శేషమణి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-24T22:21:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising