వృద్ధుల హక్కుల పరిరక్షణకు కృషి
ABN, First Publish Date - 2022-11-07T00:23:46+05:30
వృద్ధుల హక్కుల పరిరక్షణకు న్యాయవ్యవస్థ కృషి చేస్తోందని 5వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి.విజయ్‌గౌతమ్ అన్నారు.
రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 6: వృద్ధుల హక్కుల పరిరక్షణకు న్యాయవ్యవస్థ కృషి చేస్తోందని 5వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి.విజయ్‌గౌతమ్ అన్నారు. స్థానిక గౌతమీ జీవకారుణ్య సంఘంలో ఆదివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో వృద్ధులకు న్యాయసేవల పథకం-2016పై నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. వృద్ధుల సమస్యలను పారా లీగల్ వలంటీర్లు, ప్యానల్ లాయర్ల ద్వారా డీఎల్‌ఎస్‌ఏ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు. పింఛన్లు రాకపోయినా, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేకపోయినా, అర్హత ఉన్నా సంక్షేమ పథకాలు అందకపోయినా డీఎల్‌ఎస్‌ఏ ద్వారా ఆయా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. అనంతరం అక్కడున్న వృద్ధుల నుంచి అర్జీలను స్వీకరించారు. వృద్ధులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కె.ప్రతూషకుమారి, 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.సాయిసుధా, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ళ సుబ్బారావు, సౌత్‌జోన్ డీఎస్పీ శ్రీలత మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా వయోవృద్ధుల సంక్షేమ సంస్థ అధ్యక్షుడు కె.మదన్ మోహన్‌రెడ్డి, డీఎంహెచ్‌వో ప్రొగ్రాం ఆఫీసర్ మౌనిక, సీడీపీవో కె.వెంకట నరసమ్మ, జీవకారుణ్య సంఘం ఐవో కృష్ణవేణి, డాక్టర్ అశోక్‌కుమార్, ప్యానల్ లాయర్లు, పారా లీగల్ వలంటీర్లు, లా విద్యార్థులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-07T00:23:46+05:30 IST