నెల్లూరు: అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్న నలుగురి అరెస్ట్.
ABN, First Publish Date - 2022-10-29T16:45:48+05:30
నెల్లూరు: లోక్ యాప్ (Loan App) ద్వారా తీసుకున్న అప్పు కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాలని ఏజెంట్లు వేధించడంతో విసిగిపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
నెల్లూరు: లోన్ యాప్ (Loan App) ద్వారా తీసుకున్న అప్పు కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాలని ఏజెంట్లు వేధించడంతో విసిగిపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. వారు నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, బ్యాంకు ఖాతాల్లోని అధిక మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. నెల్లూరుకు చెందిన కొండ్రెడ్డి విద్యాసాగర్ రెడ్డి కొంత మొత్తంలో అప్పు తీసుకున్నాడు. అయితే తీసుకున్నఅప్పు కంటే అధిక మొత్తంలో చెల్లించాడు. ఇంకా చెల్లించాలంటూ వేధించడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన జాదవ్ యువరాజ్, పవర్ అజయ్ పవన్ కళ్యాణ్, రాథోడ్ సాయికిరణ్, కర్నాటక రాష్ట్రానికి చెందిన అబ్దుల్ లయక్‌ను అరెస్టు చేసి వారి నుంచి నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాల్లోని రూ. 1.20 కోట్లను ఫ్రీజ్ చేశారు. లీసా అలియాస్ లీ-జూహాస్ అనే మహిళ ఆధ్వర్యంలో ఈ లోన్‌యాప్‌ల నిర్వహణ కొనసాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Updated Date - 2022-10-29T16:46:10+05:30 IST