AP News: ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో అక్రమాలు
ABN , First Publish Date - 2022-11-07T22:27:36+05:30 IST
Nellore: ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదులో అధికారపార్టీ నేతలు, అధికారులు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారని సీపీఎం (CPM) నేతలు ఆరోపిస్తున్నారు.
Nellore: ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదులో అధికారపార్టీ నేతలు, అధికారులు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారని సీపీఎం (CPM) నేతలు ఆరోపిస్తున్నారు. అధికారపార్టీ శ్రేణులు నెల్లూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి రాత్రి వేళ కట్టల కొద్ది దరఖాస్తులు తీసుకువచ్చారని కార్యాలయం ఎదుట ఎమ్మెల్సీ అభ్యర్థి బాబురెడ్డి, ప్రజాసంఘాల నాయకులు, సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. ఆర్జేడీ, ఇన్‌చార్జి డీఈవోలు భారీ అక్రమాలకి పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి ఇంటివద్దకి ఇన్‌చార్జి డీఈవో వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more