కన్నులపండువగా శ్రీకృష్ణసమేత గోదాదేవి తెప్పోత్సవం

ABN , First Publish Date - 2022-05-15T04:53:44+05:30 IST

శ్రీకృష్ణసమేత గోదాదేవి తెప్పోత్సవం శనివారం కన్నుల పండువగా నిర్వహించారు.

కన్నులపండువగా శ్రీకృష్ణసమేత గోదాదేవి తెప్పోత్సవం
స్వామివారి తెప్పోత్సవం

కడప మారుతీనగర్‌, మే14: శ్రీకృష్ణసమేత గోదాదేవి తెప్పోత్సవం శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. తిరుమల తొలిగడప దేవునికడపలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం 7 గంటలకు ఆలయ సమీప పుష్కరిణిలో స్వామివారిని మూడు ప్రదక్షిణలు గావించారు. అధికసంఖ్యలో భక్తులు హాజరై తెప్పోత్సవాన్ని తిలకించి పులకించారు. కార్యక్రమానికి ముందుగా శ్రీకృష్ణసమేత  గోదాదేవిని ఆ లయ అర్చకులు కృష్ణమోహన్‌, త్రివిక్రం, కృష్ణమూర్తి అందంగా అలంకరింపచేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కార్యక్రమంలో ఆలయ ఇన్‌స్పెక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

Read more