ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srinivasarao: పేదల పథకాల్లో కోత పెడుతూ.. జగన్ మోసం: శ్రీనివాసరావు

ABN, First Publish Date - 2022-12-31T15:59:53+05:30

పెన్షన్లు (Pensions), అమ్మఒడి (Ammaodi) వంటి సంక్షేమ పథకాలలో కోతలు ఆపాలని, జగనన్న (jagananna) ఇళ్ళ నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (Srinivasarao) డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పెన్షన్లు (Pensions), అమ్మఒడి (Ammaodi) వంటి సంక్షేమ పథకాలలో కోతలు ఆపాలని, జగనన్న (jagananna) ఇళ్ళ నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (Srinivasarao) డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పేదల పథకాల్లో కోత పెడుతూ.. జగన్ మోసం చేశారని, వయో వృద్ధులు, వితంతువులకు ఆసరా లేకుండా చేశారని విమర్శించారు. తప్పుడు సర్వేలు, రికార్డుల పేరుతో పేదల పొట్ట కొట్టారన్నారు.

300 యూనిట్ల కరెంటు వాడకం ఉంటే పెన్షన్‌ ఇవ్వబోమని చెప్పడం దుర్మార్గమని శ్రీనివాసరావు అన్నారు. ఓటు వేయలేదని, మరొక పార్టీకి చెందిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరి కాదన్నారు. అమ్మఒడి లబ్ధిదారులకు కూడా షరతులు పెట్టి 3.5 లక్షల మందికి కోత విధించారని, ట్యాబ్‌ల పంపిణీ పేరుతో మరో 5 లక్షల మందిని తగ్గించారని విమర్శించారు. రేషన్‌ డిపోలలో సంక్రాంతి సందర్భంగా బియ్యంతోపాటు పండుగ సరుకులు కూడా పంపిణీ చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-12-31T15:59:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising