ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎ.కొండూరుకు కృష్ణానీరు

ABN, First Publish Date - 2022-10-27T00:44:54+05:30

కిడ్నీ వ్యాధులతో అల్లాడుతున్న ఎ.కొండూరు ప్రజలకు కృష్ణానది నీటిని అందించేందుకు ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. రూ.6 కోట్లతో డిస్ర్టిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఇంటింటికీ కృష్ణానది నీటిని అందించనుంది. జిల్లా గనులు భూగర్భ వనరుల శాఖ పరిధిలో మినరల్‌ ఫండ్‌ ద్వారా కృష్ణా వాటర్‌ ప్రాజెక్టును చేపట్టేందుకు చర్యలు చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.6 కోట్లతో డిస్ర్టిబ్యూషన్‌ నెట్‌వర్క్‌, ట్యాప్‌ కనెక్షన్లు

పనులు పూర్తయ్యేలోపు తాత్కాలిక ట్యాంకులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఇటీవల కాలంలో ఎ.కొండూరులో కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మంచినీరు కలుషితం కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. రాజకీయ పార్టీలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. సీపీఎం ఆధ్వర్యంలోని నిజనిర్ధారణ కమిటీ ఓ అధ్యయనమే చేసింది. దీంతో ఈ అంశంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఎ.కొండూరు ప్రజలకు కృష్ణానది నీటిని అందించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు చేపట్టాలంటే మైలవరం కృష్ణానీటి పంపిణీ సామర్థ్యాన్ని మెరుగుపరచాలి. డిస్ర్టిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ పనులు చేపట్టాలి. దీనిద్వారా ఇంటింటికీ ట్యాప్‌ కనెక్షన్‌ ఇవ్వాలి.

రూ.6 కోట్లతో..

ఎ.కొండూరు మండలానికి పూర్తిస్థాయిలో రక్షిత మంచినీరు పంపిణీ చేసేందుకు రూ.6 కోట్లు వ్యయమవుతుందని ఆర్‌డబ్ల్యూఎస్‌ యంత్రాంగం అంచనాలు సిద్ధం చేసింది. మినరల్‌ ఫండ్స్‌ వినియోగానికి సంబంధించి స్పష్టత వచ్చేందుకు నెల నుంచి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈలోపు తాత్కాలికంగా రక్షిత మంచినీటి సరఫరా బాధ్యతలను చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ భావిస్తోంది. ఈ మేరకు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ నేతృత్వంలోని బృందం శనివారం నాటికి ఎ.కొండూరు మండలంలోని కిడ్నీ బాధిత గ్రామాలను పరిశీలిస్తుంది.

50 సింటెక్స్‌ ట్యాంకుల ద్వారా..

ఎ.కొండూరు మండలంలో మొత్తం 50 సింటెక్స్‌ ట్యాంకులను ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ ట్యాంకుల్లో కృష్ణానది నీటిని నింపుతారు. గ్రామస్తులు సింటెక్స్‌ ట్యాంకుల వద్దకెళ్లి మంచినీటిని పట్టుకోవాల్సి ఉంటుంది. కుదప వద్ద ఒక సంప్‌ ఉంది. ఈ సంప్‌కు కృష్ణానది నీటిని మళ్లించి అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా ఎంపిక చేసిన గ్రామాల్లోని సింటెక్స్‌ ట్యాంకులను నింపుతారు. ఈ విధానం ఒకటి, రెండు నెలలు పని చేస్తుంది. ఈలోపు మినరల్‌ ఫండ్‌ ద్వారా శాశ్వత ప్రాతిపదికన పైపులైన్లు, ట్యాప్‌ కనెక్షన్ల పనులు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - 2022-10-27T00:44:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising