ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి నిధులు ఉఫ్‌..!

ABN, First Publish Date - 2022-10-23T00:49:00+05:30

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) అమల్లో అవినీతి రాజ్యమేలుతోంది. నిరుపేదలకు ఇచ్చే జాబ్‌ కార్డుల్లో నకిలీవి సృష్టించి రూ.లక్షల్లో దోచేస్తున్నారు. బినామీ పేర్లతో నకిలీవి సృష్టించి రెండు జిల్లాల్లో అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా వెలుగుచూసిన రెండు ఘటనలు ఈ అక్రమాలను బయటపెట్టడంతో పాటు కార్మికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే వరకూ వెళ్లాయి. అంతేకాదు.. రెండు జిల్లాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్ల పనితీరుపై అనుమానాలు రేకెత్తించాయి. - (ఆంరఽధజ్యోతి, విజయవాడ)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపాధి హామీ పథకంలో అవినీతి బాగోతాలు

నకిలీ జాబ్‌ కార్డులతో కోట్లాది రూపాయలు స్వాహా

ముస్తాబాద, గన్నవరం పంచాయతీల్లో రూ.లక్షల్లో..

ఫీల్డ్‌ అసిస్టెంట్ల అక్రమాలపై అధికారులకు ఫిర్యాదులు

ముస్తాబాద పంచాయతీలో..

ముస్తాబాద పంచాయతీలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. దీనిపై శనివారం ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. ఉపాధి హామీ పనుల్లో కూలి పనికి రానివారికీ హాజరు వేస్తూ ముస్తాబాద ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కైలే ప్రసన్న కుమారి అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పనికి వచ్చినవారికి, రానివారికి కూడా డబ్బులు పడేలా అక్రమాలకు పాల్పడుతున్నారని 40 మందికి పైగా ఉపాధి హామీ కూలీలు గన్నవరం ఎండీవో, ఎంపీపీ, ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ ఫిర్యాదులు అందజేశారు. పనికి వచ్చినవారికి హాజరు ఇవ్వకుండా వెనక్కు పంపేస్తోందని, అసభ్య పదజాలంతో దూషిస్తోందని, తల్లడిల్లిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మచ్చుకు కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే.. బొడ్డు సుబ్బారావు, కైలే ముని, పి.అరుణ, బొడ్డు మౌనిక, బద్రీ, మల్లేశ్వరి, కైలే జోజమ్మ, ప్రసాద్‌, బిన్ను తదితరుల పేరుతో చాలాకాలంగా ఫేక్‌ జాబ్‌కార్డులతో నిధులు స్వాహా చేసినట్టుగా తెలుస్తోంది. వీరంతా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బినామీలేనని సమాచారం. భర్త, కొడుకు, బంధువుల పేరుతో ఫేక్‌ జాబ్‌కార్డులు సృష్టించి డ్రా చేసినట్టుగా సమాచారం.

గన్నవరం పంచాయతీలో..

గన్నవరం గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ భర్త బోగస్‌ జాబ్‌ కార్డులు కలిగిన వారి ఇళ్లకు వెళ్లి కలెక్షన్లు నిర్వహిస్తున్నాడని కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇలా అనేక పంచాయతీల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఏపీవోలపై ఫిర్యాదులు అందుతున్నాయి. గన్నవరంలో కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే.. కొలకలూరి జ్యోతి, సౌజన్య, రంగమ్మ, వెంకటేశ్‌, దానియేలు, అనూరాధ పేరిట ఫేక్‌ జాబ్‌కార్డులు సృష్టించి డబ్బు డ్రా చేసినట్టు సమాచారం. ఇక్కడి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ భర్త బండిపై ఫేక్‌ జాబ్‌ హోల్డర్ల ఇంటికి వెళ్లి డబ్బు వసూలు చేస్తున్నాడని, వీడియో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటం విశేషం.

పనుల ఆడిట్‌ ఏదీ?

పంచాయతీల పరిధిలో జరుగుతున్న పనులకు సంబంధించి ఆడిట్‌ సక్రమంగా జరగటం లేదు. కొన్నిచోట్ల మొక్కుబడిగా జరుగుతోంది. ఆడిట్‌ సందర్భంలో లోపాలను గుర్తించి బేరాలకు దిగుతున్న ఉదంతాలు కూడా ఉంటున్నాయి.

జవాబుదారీతనాన్ని తీసుకురావాలి

ఉపాధి హామీ పథకం పనుల్లో పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఏపీవోలు, ఇతర సిబ్బందిపై వస్తున్న ఆరోపణలతో జవాబుదారీ తనం లోపిస్తోంది. ఓ చిన్న గ్రామంలో నెలకు రూ.10 లక్షల మేర దిగమింగుతున్నారంటే, ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో తెలుస్తోంది. కాబట్టి గ్రామస్థాయిలో ప్రజలందరికీ ఉపాధి హామీ పథకం పనుల గురించి తెలిసేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి ప్రజలే ఆడిట్‌ చేసేలా విధానాలు మార్చాలి.

- కళ్లం వెంకటేశ్వరరావు, కృష్ణాజిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు

Updated Date - 2022-10-23T00:49:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising