Ramakrishna: ఏపీలో పోర్టులు, ధర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ అదానీకేనా?..
ABN, First Publish Date - 2022-10-27T12:30:16+05:30
విజయవాడ (Vijayawada): సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
విజయవాడ (Vijayawada): సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆదాయాన్నిచ్చే ప్రజా ఆస్తులన్నీ సీఎం జగన్ (CM Jagan) .. అదానీ (Adani)కే కట్టబెడతారా? అని ప్రశ్నించారు. ఏపీలో పోర్టులు (Ports), ధర్మల్ విద్యుత్ (Dharmal Vidyut) కేంద్రాలన్నీ అదానీకేనా?.. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టుని అదానీకి ధారాదత్తం చేసిన జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు నేలటూరులోని కృష్ణపట్నం ధర్మల్ పవర్ స్టేషన్‌ను కూడా అప్పగించేందుకు సిద్ధమవటం దుర్మార్గమన్నారు. వేలాది ఎకరాల భూములు త్యాగం చేసిన రైతులకు, నిర్వాసితులైన జనానికి ఇది తీరని అన్యాయమని అన్నారు. రూ. 23 వేలకోట్ల రూపాయల ప్రజా పెట్టుబడిని మెయింటినెన్స్ పేరుతో ఆదానీకి అప్పనంగా అప్పగిస్తారా?... ఆదానీ కంపెనీకి, జగన్ ప్రభుత్వానికి మధ్య ఉన్న లాలూచీ ఏంటని ప్రశ్నించారు. కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Updated Date - 2022-10-27T12:30:19+05:30 IST