AP News: పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి నారాయణ స్వామి
ABN, First Publish Date - 2022-11-08T15:57:00+05:30
Kadapa: సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ (Social Justice and Empowerment) కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి (Narayana Swamy) అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లాకు వచ్చిన ఆయన కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం (Review meeting) నిర్వహించారు.
Kadapa: సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ (Social Justice and Empowerment) కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి (Narayana Swamy) అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లాకు వచ్చిన ఆయన కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం (Review meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఎనీమియా కేసులు ఎక్కువ ఉన్నట్లు గుర్తించిన ఆయన ఆరోగ్యశాఖ అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. మహిళా పోలీసులు , ఐసీడీఎస్ సిబ్బంది రికార్డులు సరిగా మెయింటెనెన్స్ చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి లెక్కలు లేవని పేర్కొన్నారు. కడపలో స్వచ్చభారత్ టాయిలెట్ల ఏర్పాటులో అధికారులు విఫలమయ్యారని చెప్పారు. జిల్లాలో పేదలకు గృహ నిర్మాణం పథకం ఆశా జనకంగా ఉన్నా.. ఇప్పటికి పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పజెప్పడంలో ఎందుకు జాప్యం జరిగిందని ప్రశ్నించారు.
Updated Date - 2022-11-08T16:00:17+05:30 IST