AP News: మంగళగిరిలోని ఎయిమ్స్‌కు నీటి సరఫరాకు అనుమతి
ABN, First Publish Date - 2022-10-28T08:28:00+05:30
అమరావతి: మంగళగిరిలోని ఎయిమ్స్ (AIIMS)కు గుంటూరు జిల్లా ఆత్మకూరులోని స్టోరేజి ట్యాంక్ (Storaga Tank) ద్వారా నీటి సరఫరాకు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. గుంటూరు ఛానల్ ద్వారా ఆత్మకూరు చెరువులోకి నీటిని నింపి ఆ నీటిని ఎయిమ్స్‌కు సరఫరా చేయనున్నారు.
అమరావతి: మంగళగిరిలోని ఎయిమ్స్ (AIIMS)కు గుంటూరు జిల్లా ఆత్మకూరులోని స్టోరేజి ట్యాంక్ (Storaga Tank) ద్వారా నీటి సరఫరాకు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. గుంటూరు ఛానల్ ద్వారా ఆత్మకూరు చెరువులోకి నీటిని నింపి ఆ నీటిని ఎయిమ్స్‌కు సరఫరా చేయనున్నారు. ఛానల్‌లో నీరు ప్రవహించిన సమయంలో 3.50 క్యూసెక్కుల వినియోగానికి అనుమతి ఇస్తూనే..ప్రభుత్వ అనుమతి లేకుండా నీటి వినియోగానికి ఎయిమ్స్‌కు ఎలాంటి అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. కాగా స్టోరేజి ట్యాంకు నుంచి సొంత ఖర్చులతో పైపులైన్ వేసుకోవాలని, పైపులైన్ వేసుకునేందుకు భూసేకరణ వ్యయం కూడా ఎయిమ్స్ సంస్థే భరించాలని రాష్ట్రప్రభుత్వం షరతు విధించింది. గృహ వినియోగదారులకు విధించే నీటి ఛార్జీలనే ఎయిమ్స్ కూడా చెల్లించాలని పేర్కొంటూ నీటి వినియోగాన్ని లెక్కించేందుకు సొంత ఖర్చుతోనే పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Updated Date - 2022-10-28T08:28:02+05:30 IST