కమ్మూరు కేసులో ఇద్దరి అరెస్టు
ABN, First Publish Date - 2022-11-07T00:25:09+05:30
కమ్మూరు కేసులో ఎట్టకేలకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. కూడేరు మండలం కమ్మూరు సర్వేనెంబరు 513-1,2,3లో 12ఎకరాల భూమి అక్రమ రిజిస్ర్టేషన, నకిలీ ఎనఓసీ తతంగంపై నమోదు చేసిన కేసులో ట్రెజరీ శాఖ నుంచి సస్పెండైన గాజుల మనోజ్‌కుమార్, తపోవనంకు చెందిన కె శ్రీనివాసులును అరెస్ట్ చేశారు. కేసులో పది మంది ఉండగా ఇద్దరినే అరెస్ట్ చేయడం గమనార్హం. వారి నుంచి నకిలీ ఎనఓసీ కాపీ, రిజిస్ర్టేషన చేయించుకున్న ఒరిజినల్ డాక్యుమెంట్, రూ.6కోట్ల విలువైన మూడు చెక్కు లు, ఒక లాప్‌టాప్, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు
మరో ఎనిమిది మంది పరారీలోనే...
నిందితులుగా టూటౌన ఎస్‌ఐ రాంప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాసులు
అనంతపురం క్రైం, కూడేరు నవంబరు 6 : కమ్మూరు కేసులో ఎట్టకేలకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. కూడేరు మండలం కమ్మూరు సర్వేనెంబరు 513-1,2,3లో 12ఎకరాల భూమి అక్రమ రిజిస్ర్టేషన, నకిలీ ఎనఓసీ తతంగంపై నమోదు చేసిన కేసులో ట్రెజరీ శాఖ నుంచి సస్పెండైన గాజుల మనోజ్‌కుమార్, తపోవనంకు చెందిన కె శ్రీనివాసులును అరెస్ట్ చేశారు. కేసులో పది మంది ఉండగా ఇద్దరినే అరెస్ట్ చేయడం గమనార్హం. వారి నుంచి నకిలీ ఎనఓసీ కాపీ, రిజిస్ర్టేషన చేయించుకున్న ఒరిజినల్ డాక్యుమెంట్, రూ.6కోట్ల విలువైన మూడు చెక్కు లు, ఒక లాప్‌టాప్, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కూడేరు పోలీ్‌సస్టేషనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్ట్ వివరాలను ఉరవకొండ రూరల్ సీఐ శేఖర్, ఎస్‌ఐ సత్యనారాయణలతో కలిసి గుంతకల్లు డీఎస్పీ నరసింగప్ప వెల్లడించారు...
నిషేధిత జాబితా నుంచి తొలగించి... నకిలీ ఎనఓసీతో..
కూడేరు మండలం కమ్మూరు గ్రామ పొలం సర్వేనెంబరు 513-1,2,3లో 12 ఎకరాల చుక్కల భూమిలో వెంచర్ వేయాలనే విషయంలో రామాంజులరెడ్డి, డీవీనాయుడు, శ్రీనివాసులు కలిశారు. ఎకరం రూ.39 లక్షలకు కొని రిజిస్ర్టేషన చేసిన తరువాత పెద్ద మొత్తంలో అమ్మాలని భావించారు. వారికి ఆ భూమి విషయంలో ఎనఓసీ, రిజిస్ర్టేషన ప్రక్రియలు పూర్తిచేయించే క్రమంలో టూటౌన ఎస్‌ఐ రాంప్రసాద్ మనోజ్‌కుమార్‌ను పరిచయం చేశారు. వారికి అప్పట్లో కూడేరు తహసీల్దార్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు, ఉరవకొండ మండల డిప్యూటీ తహసీల్దార్ గురుప్రసాద్‌లు సహకరించారు. తొలుత చుక్కల భూమిగా ఉన్న ఆభూమి స్వభావాన్ని పట్టాగా మార్పు చేశారు. ఆ తరువాత నిషేధిత జాబితా 22(ఏ)నుంచి తొలగించారు. అనంతరం అనంతపురం రూరల్ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో రిజిస్ర్టేషన ప్రక్రియ పూర్తి చేశారు. రికార్డులను పరిశీలిం చకుండానే మ్యుటేషన, టైటిల్ డీడ్ కమ్ పట్టాదారు పాస్‌బుక్‌లను మంజూరు చేశారు. 1బీ అడంగల్లో ఉన్న డి-పట్టాని పట్టాగా మార్చడానికి ఒక జిల్లా అధికారి ఇచ్చినట్లు నకిలీ ఎనఓసీ సృష్టించారు. అందులో కలెక్టరేట్‌లోని ఈ-సెక్షన సూపరింటెండెంట్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. జిల్లా కలెక్టర్ నుంచి వచ్చినట్లు వ్యవహారం నడిపారు.
కేసులో 10 మంది..
కమ్మూరు కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా చేర్చారు. అందులో అనం తపురం నగర టూటౌన ఎస్‌ఐ రాంప్రసాద్, అప్పటి కూడేరు తహసీల్దార్ శ్రీనివాసులు(ప్రస్తుతం సస్పెండ్‌లో)ను నిందితులుగా చేర్చారు. అలాగే గాజుల మనోజ్‌కుమార్, డి.వెంకటనాయుడు, కె.శ్రీనివాసులు, గురుప్రసాద్ (డిప్యూటీ తహసీ ల్దార్), త్రినాథ్(రిజిస్ర్టేషన్ల శాఖలో సీనియర్ అసిస్టెంట్), డి.వరలక్ష్మి (డీవీ.నాయుడు భార్య), జేసీ వసంత, కమురున్నీసాలను నిందితులుగా చేర్చారు. ఇందులో కము రున్నీసా, జేసీ వసంతను మనోజ్‌కుమార్ బినామీలుగా భావిస్తున్నారు.
కేసు ఏసీబీకి బదిలీ...
కమ్మూరు కేసును అవినీతి నిరోధక శాఖ(ఏసీబీకి) అప్పగిస్తున్నట్లు డీఎస్పీ నరసింగప్ప తెలిపారు. ఈ కేసులో వివిధ శాఖల అధికారులున్నందున తదుపరి విచారణ నిమిత్తం ఏసీబీకి బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తులో వివిధ కోణాల్లో విచారణలో భాగంగా టూటౌన ఎస్‌ఐ రాంప్రసాద్‌ను ముద్దాయిగా చేరుస్తూ శాఖాప రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఉదయం 11గంటల నుంచి...
కూడేరు పోలీ్‌సస్టేషనలో అరె్‌స్టకు సంబంధించి ఉదయం 11గంటలకే ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. చివరికి సాయంత్రం 4గంటలకు వారి అరె్‌స్టను చూపాల్సి వచ్చింది. ఇదంతా మనోజ్‌కుమార్‌ను రప్పించడంలోనే ఆలస్యం జరిగినట్లు తెలిసింది. కానీ మనోజ్‌కుమార్, శ్రీనివాసులును కూడేరు మండలం అరవకూరు బస్టా్‌పలో రోడ్డు పక్కనున్న చెట్టు కింద ఉండగా ఆదివారం ఉదయం 10గంటల సమయంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - 2022-11-07T00:25:09+05:30 IST