ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fake documents: ఐటీ ఉద్యోగులకు వరుస షాకులు.. ఆ తప్పు చేసుంటే ఇంటికే..!

ABN, First Publish Date - 2022-11-10T19:21:01+05:30

నకిలీ డాక్యుమెంట్లతో ఉద్యోగాలు పొందిన వారిని ఐటీ సంస్థలు తొలగించేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఫేక్ డాక్యుమెంట్లతో(Fake documents) ఉద్యోగాలు పొందుతున్న వారి పట్ల ఐటీ సంస్థలు(IT companies) కఠిన చర్యలకు ఉపక్రమించాయి. నైపుణ్యాలు, అనుభవానికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లతో ఉద్యోగం పొందిన వారిని గుర్తించిన వెంటనే తొలగించేస్తున్నాయి. ఇటువంటి వారిపై ప్రముఖ ఐటీ సంస్థ ఆక్సెంచర్(Accenture) ఇటీవల ఉక్కుపాదం మోపింది. ఆ జాబితాలోకి తాజాగా మరో సంస్థ వచ్చి చేరింది. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్లతో సహా రకరకాల ఫేక్ డాక్యుమెంట్లతో ఉద్యోగం పొందిన వారిని తీసేసినట్టు కాగ్నిజెంట్(Cognizant) తాజాగా తెలిపింది. ఈ తరహా తొలగింపులకు ఐటీ వర్గాల్లో ఇన్‌వాలంటరీ ఆట్రిషన్ (Involuntary attrition) అని పేరు. తమ సంస్థలో ఇది ఆరు శాతంగా ఉందని కాగ్నిజెంట్ పేర్కొంది. ‘‘తమ ఉద్యోగాలకు కావాల్సిన నేపథ్యం వీరికి లేదు. వీళ్లను అస్సలు సహించం’’ అని సంస్థ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.

ఇటీవల కాలంలో ఐటీ సంస్థలకు ఫేక్ డాక్యుమెంట్ల బెడద ఎక్కువైంది. కరోనా తరువాత.. ఐటీ ఉద్యోగులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నాయి. ఉద్యోగ నియామక ప్రక్రియని వేగవంతం చేశాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని అనేక మంది తమకు తగిన అర్హతలు లేకున్నా ఫేక్ డాక్యుమెంట్లతో ఐటీ ఉద్యోగాలను కొట్టేశారు.

అయితే.. కంపెనీలు తమ ఉద్యోగులపై బ్యాగ్ గ్రౌండ్ చెక్స్ చేస్తుండటంతో వీరి బండారం బయటపడుతోంది. ఇక నియామక ప్రక్రియ మొత్తం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో జరుగుతుండటంతో.. నకిలీల బెడద పెరిగిందని లాయర్లు చెబుతున్నారు. నకిలీ అభ్యర్థుల గురించి హెచ్ ఆర్ సంస్థలు ఐటీ కంపెనీల దృష్టికి తెచ్చినా.. సిబ్బంది కొరత దృష్ట్యా కంపెనీలు ముందుకెళ్లిపోయాయి. దీంతో.. అభ్యర్థులకు ఉద్యోగం ఇచ్చే ముందే వారి అర్హతల గురించి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని రిక్రూటింగ్ సంస్థలు సూచిస్తున్నాయి.

ఇదీ చదవండి: మరో షాకిచ్చిన మస్క్.. ఉద్యోగులకు దిమ్మతిరిగేలా తొలి ఈ-మెయిల్..!

Updated Date - 2022-11-10T19:41:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising