ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Motorola Edge 30: మీరు వాడుతున్నది ఈ ఫోనేనా?.. అయితే మీకో గుడ్‌న్యూస్

ABN, First Publish Date - 2022-10-28T16:31:00+05:30

మీరు కనుక మోటరోలా ఎడ్జ్ 30(motorola edge 30) హ్యాండ్‌సెట్ వాడుతుంటే ఇది మీకు శుభవార్తే. ఇప్పుడీ ఫోన్ 5జీకి సపోర్ట్ చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మీరు కనుక మోటరోలా ఎడ్జ్ 30(motorola edge 30) హ్యాండ్‌సెట్ వాడుతుంటే ఇది మీకు శుభవార్తే. ఇప్పుడీ ఫోన్ 5జీకి సపోర్ట్ చేస్తోంది. కాబట్టి ఈ ఫోన్ ఉపయోగిస్తున్న వారంతా ఎంచక్కా 5జీ సేవలను ఆనందించవచ్చు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మేకర్స్ అందరూ తమ డివైజ్‌లకు ఓటీఏ (over-the-air) అప్‌డేట్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ అప్‌డేట్ కనుక వస్తే 5జీ సేవలను ఉపయోగించుకునే వీలు చిక్కుతుంది. ప్రస్తుతం మోటరోలాలో రెండు హ్యాడ్స్‌సెట్స్ మాత్రమే ఎయిర్‌టెల్ 5జీకి సపోర్ట్ చేస్తున్నాయి. అవి.. మోటరోలా ఎడ్జ్ 30 ప్యూజన్( Motorola Edge 30 Fusion). మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా(Motorola Edge 30 Ultra). ఇప్పుడీ సపోర్ట్‌ను మోటరోలా ఎడ్జ్ 30కి కూడా విస్తరించింది. ఫలితంగా ఈ ఫోన్ ఉపయోగిస్తున్న వారు కూడా 5జీ సేవలను పొందగలుగుతారు. ‘ఎడ్జ్ 30’ని మోటరోలా ఇటీవలే విడుదల చేసింది. ఇప్పుడు దీనికి కూడా 5జీ సపోర్ట్ అందించింది. ఈ సిరీస్‌లో విడుదలైన మోటారోలా ఎడ్జ్ 30 ప్రొకి 5జీ సపోర్ట్ లభిస్తే ‘ఎడ్జ్’ సిరీస్‌లోని అన్ని ఫోన్లకు 5జీ సపోర్ట్ లభించినట్టు అవుతుంది.

త్వరలోనే ఈ ఫోన్లకు కూడా..

ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్ ప్రస్తుతం మోటరోలా ఎడ్జ్ 30 ప్యూజన్, మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా, మోటరోలా ఎడ్జ్ 30లకు మాత్రమే సపోర్ట్ చేస్తోంది. త్వరలోనే ఓఈఎం (original equipment manufacturer) 5జీ సపోర్ట్‌తో ఓటీఏ అప్‌డేట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ జాబితాలో మోటో జి65 5జి, మోటో జి82 5జి, మోటో జి71 5జి, మోటరోలా ఎడ్జ్ 30 ప్రొ, మోటో జి 51, 5జి, మోటరోలా ఎడ్జ్ 20, మోటరోలా ఎడ్జ్ 20 ప్రొ, మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్, మోటరోలా రేజర్ 5జీ, మోటో జి 5జీ ఫోన్లు ఉన్నాయి.

ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ నెట్‌వర్క్ సర్వీసులు ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, సిలిగురి, వారణాసి, నాగ్‌పూర్, బెంగళూరు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక ఈ నగరాల్లో ఉండి 5జీకి సపోర్ట్‌ చేసే ఫోన్‌, యాక్టివ్ 4జీ సిమ్ ఉంటే 5జీ సేవలను పొందొచ్చు. ఎయిర్‌టెల్ తన 5జీ సేవలను మున్ముందు మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఎయిర్‌టెల్ కృషి చేస్తోంది.

Updated Date - 2022-10-28T16:31:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising