ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amazon Layoffs: అమెజాన్ బ్యాడ్‌న్యూస్.. అస్సలు ఊహించని నిర్ణయం..

ABN, First Publish Date - 2022-11-11T19:32:16+05:30

ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న గ్లోబల్ దిగ్గజ కంపెనీలు మెటా (META), ట్విటర్ (Twitter), మైక్రోసాఫ్ట్ (Microsoft) జాబితాలో మరో టెక్ దిగ్గజం అమెజాన్ (Amazon) చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న గ్లోబల్ దిగ్గజ కంపెనీలు మెటా (META), ట్విటర్ (Twitter), మైక్రోసాఫ్ట్ (Microsoft) జాబితాలో మరో టెక్ దిగ్గజం అమెజాన్ (Amazon) చేరింది. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే లాభాపేక్షలేని కార్యక్రమాల కుదింపు, కొత్త నియామకాల నిలుపుదల వంటి చర్యలు చేపట్టిన కంపెనీ.. తాజాగా ఉద్యోగుల తొలగింపునూ మొదలుపెట్టింది. అమెజాన్ కంపెనీ తనను ఉద్యోగం నుంచి తొలగించిందంటూ జమీ జాంగ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ తెలిపాడు. లింక్డ్‌ఇన్ (LinkedIn) వేదికగా తన బాధను వ్యక్తపరిచాడు. ‘‘ అమెజాన్ రోబోటిక్స్ ఏఐలో ఒకటిన్నరేళ్ల నా ప్రయాణం ఆశ్చర్యకర రీతిలో ముగిసిపోయింది.(మా రోబోటిక్స్ టీమ్ మొత్తం పోయింది). అద్భుత ప్రతిభ కలిగిన లీడర్లు, ఇంజనీర్ల మధ్య పనిచేయడం గొప్ప అనుభూతి. ఈ ప్రక్రియలో నన్ను మెరుగైన సాఫ్ట్‌వేర్‌గా మార్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అన్వేషిస్తున్నాను. నాకు రిఫరల్స్, నేరుగా సందేశాలు వస్తాయని ఆశిస్తున్నాను’’ అంటూ రాసుకొచ్చాడు.

కాగా రోబోటిక్స్ టీమ్ మొత్తాన్ని తొలగించారని జమీ జాంగ్ చెప్పడం గమనార్హం. అమెజాన్ రోబోటిక్స్ విభాగంలో కనీసం 3,766 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని లింక్డ్ఇన్ డేటా పేర్కొంది. మరి అమెజాన్ ఎంతమందిని తొలగించారనేదానిపై స్పష్టత లేదు. ఇదిలావుండగా అమెజాన్‌కు చెందిన స్వచ్ఛంద సేవా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది మరోచోట ఉద్యోగాలు వెతుక్కోవాలని కంపెనీ సూచించినట్టు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ రిపోర్ట్ పేర్కొంది. త్వరలోనే సేవా ప్రాజెక్టుల మూసివేత లేదా రద్దు చేసే అవకాశాలు ఉండడమే ఇందుకు కారణమని తెలిపింది.

Updated Date - 2022-11-11T19:32:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising