ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IT Layoffs: మరో దిగ్గజ ఐటీ కంపెనీ కీలక నిర్ణయం.. ఒకేసారి 4 వేల మంది ఉద్యోగులు ఇంటికి..

ABN, First Publish Date - 2022-11-19T18:21:44+05:30

ఐటీ రంగంలో మాంద్యం నాటి పరిస్థితులు మళ్లీ ముంచుకొస్తున్నాయి. పలు ఐటీ కంపెనీలు కొందరు ఉద్యోగులను ఎడాపెడా తీసిపడేశాయి. అమెజాన్‌ మొదలుకుని ట్విట్టర్ వరకూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐటీ రంగంలో మాంద్యం నాటి పరిస్థితులు మళ్లీ ముంచుకొస్తున్నాయి. పలు ఐటీ కంపెనీలు కొందరు ఉద్యోగులను ఎడాపెడా తీసిపడేశాయి. అమెజాన్‌ మొదలుకుని ట్విట్టర్ వరకూ ఇదే దారిలో వెళుతున్నాయి. తొలుత మూన్‌లైటింగ్, ఆ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్, ప్రస్తుతం కాస్ట్ కటింగ్.. ఇలా కారణం ఏదైతేనేమి ఐటీ రంగంలో ఉద్యోగాల కోతల కాలం నడుస్తోంది. తాజాగా మరో దిగ్గజ ఐటీ కంపెనీ కూడా ఇదే బాటలో వెళ్లాలని నిర్ణయించింది. అమెరికా దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన Cisco భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధపడినట్లు తెలిసింది. ఒకేసారి 4,100 ఉద్యోగులను ఉన్నపళంగా తీసేయాలని Networking Giant Cisco నిర్ణయించినట్లు సమాచారం.

కాలిఫోర్నియాకు చెందిన సిలికాన్ వ్యాలీ బిజినెస్ జర్నల్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. సిస్కో‌లో మొత్తం 83,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని.. ‘Rebalancing’ Act for ‘Rightsizing the Business’ పేరుతో 4 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు Cisco నిర్ణయించినట్లు జర్నల్‌లో చెప్పుకొచ్చారు. అయితే.. ఉద్యోగాలను తీసివేయాలనుకోవడానికి కారణం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలనో, కాస్ట్ సేవింగ్స్‌లో భాగంగానో కాదని Cisco Chief Financial Officer స్కాట్ హెరెన్ చెప్పారు. ఈ నిర్ణయాన్ని కేవలం ‘Rebalancing’గా మాత్రమే చూడాలని తెలిపారు. ఈ ఉద్యోగాల తీసివేత నిర్ణయం కారణంగా ఇప్పటికే ఈ చర్యకు పాల్పడిన Meta, Twitter, Salesforce, Amazon వంటి టెక్ కంపెనీల జాబితాలో Cisco కూడా నిలిచింది.

ఇదిలా ఉండగా.. అమెజాన్‌లో ఉద్యోగాల కోతలు వచ్చే ఏడాదీ కొనసాగనున్నాయి. కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ ఈ విషయం ప్రకటించారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేదంటూ అమెజాన్‌ కొద్ది రోజుల క్రితమే 11,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ బహిరంగంగానే మాంద్యంపై భయం వ్యక్తం చేశారు. ఎడాపెడా అప్పులు చేసి చేతులు కాల్చుకోవద్దని అమెరికా కంపెనీలు, వినియోగదారులకు హితవు చెప్పారు. సీఈఓ తాజా ప్రకటనతో అమెజాన్‌లో ఇంకా ఉన్న ఉద్యోగులకూ తీసివేతల భయం పట్టుకుంది.

Updated Date - 2022-11-19T18:22:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising