ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

iPhones: ఐఫోన్ యూజర్లకు కీలక సమాచారం..

ABN, First Publish Date - 2022-12-14T21:34:13+05:30

భారత్‌లోని ఐఫోన్ (iPhone) యూజర్లకు గుడ్‌న్యూస్!. ఇండియాలోని ఐఫోన్లపై 5జీ సపోర్ట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు యాపిల్ కంపెనీ (Apple Inc) ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లోని ఐఫోన్ (iPhone) యూజర్లకు గుడ్‌న్యూస్!. ఇండియాలోని ఐఫోన్లపై 5జీ సపోర్ట్‌ను యాపిల్ కంపెనీ (Apple Inc) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ (Airtel), జియో (Jio) నెట్‌వర్కుల యూజర్లకు డిసెంబర్ 13న రాత్రి 11:30 గంటల నుంచి 5జీ సపోర్ట్ ప్రారంభమైందని కంపెనీ వెల్లడించింది. అయితే 5జీ సేవలను పొందేందుకు యూజర్లు తమ ఫోన్లను లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ iOS 16.2 కు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐఫోన్12, ఐఫోన్13, ఐఫోన్14 సిరీస్, ఐఫోన్ ఎస్‌ఈ ఫోన్ల యూజర్లు నూతన అప్‌డేట్ ద్వారా 5జీ స్పీడ్ అడ్వాంటేజ్ పొందొచ్చని యాపిల్ కంపెనీ వెల్లడించింది. 5జీ సపోర్ట్ పొందే అవకాశమున్న ఫోన్ల జాబితాలో ఐఫోన్12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్12 ప్రో, ఐఫోన్12 ప్రో మ్యాక్స్, ఐఫోన్13, ఐఫోన్13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14, ఐఫోన్14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, ఐఫోన్ ఎస్ఈ3(2022) మొదలగు ఫోన్లు ఉన్నాయని కంపెనీ యాపిల్ కంపెనీ తెలిపింది.

మీ ఫోన్‌పై ఇలా యాక్టివేట్ చేసుకోవాలి...

ఐఫోన్ యూజర్లు సెట్టింగ్స్ యాప్‌లోకి వెళ్లాలి. జనరల్ ట్యాబ్ ఓపెన్ చేయాలి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ క్లిక్ చేయాలి. డౌన్‌లోడ్ iOS 16.2ను డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ తర్వాత టర్మ్స్ అండ్ కండీషన్స్‌ను యాక్సెప్ట్ చేయాలి. లేటెస్ట్ వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ముందు డేటాకు బ్యాకప్ ఉంచుకోవడం బెటర్. ఇన్‌స్టాల్ చేసుకున్నాక యూజర్లు తమ డివైజ్‌ను రిస్టార్ట్ చేసుకోవాలి. ఒకసారి రీస్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ వైఫై యాక్టివ్‌గా లేకపోతే నోటిఫికేషన్ ఏరియాలో ఒక కొత్త 5జీ స్టేటస్ ఐకాన్ కనిపిస్తుంది. ఒకవేళ ఐకాన్ కనిపించకపోతే.. సెట్టింగ్స్ యాప్‌కి వెళ్లి సెల్యులార్ ట్యాబ్.. ఆ తర్వాత సెల్యులార్ డేటా ఆప్షన్ యాక్సెస్ చేసుకోవాలి. ఇక ఫోన్‌లో రెండు యాక్టివ్ సిమ్‌లు ఉంటే ఏ సిమ్‌పై 5జీ కావాలనుకుంటున్నారో ఎంచుకోవచ్చు. కొత్త అప్‌డేట్‌లో యాపిల్ మ్యూజిక్ సింగ్ ఫీచర్ కూడా అన్ని డివైజ్‌లపై యాడ్ లభిస్తుంది. ఐఫోన్ 14, ఐఫోన్ ప్రో మోడల్ ఫోన్ల లాక్ స్ర్కీన్, ఇతర బగ్ ఫిక్సెస్‌ మెరుగుపడతాయి.

Updated Date - 2022-12-14T21:40:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising