ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ather: హోసూరులో రెండో తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎథర్ ఎనర్జీ

ABN, First Publish Date - 2022-11-24T21:43:10+05:30

దేశంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ స్కూటర్ బ్రాండ్ ఎథర్ ఎనర్జీ (Ather Energy) తాజాగా తమ రెండో తయారీ కేంద్రాన్ని తమిళనాడులోని

Ather Energy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: దేశంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ స్కూటర్ బ్రాండ్ ఎథర్ ఎనర్జీ (Ather Energy) తాజాగా తమ రెండో తయారీ కేంద్రాన్ని తమిళనాడులోని హోసూరులో ప్రారంభించింది. 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ కేంద్రం ద్వారా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 4.20 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అథర్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తున్న 450X, 450 Plus కోసం పెరుగుతున్న డిమాండ్‌ అవసరాలను సైతం ఇది తీర్చనుంది.

నూతన ప్లాంట్ ప్రారంభం సందర్భంగా ఎథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు, సీటీవో స్వప్నిల్ జైన్ మాట్లాడుతూ.. సురక్షితమైన, ఆధారపడదగిన ఉత్పత్తులను వినియోగదారులకు అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. తాజా తయారీ కేంద్రంలో రెండు యూనిట్లు ఉన్నాయి. వాటిలో ఒకటి పూర్తిగా బ్యాటరీ ఉత్పత్తి కోసం కాగా, రెండో దానిని వాహన అసెంబ్లీ కోసం కేటాయించారు. బ్యాటరీ యూనిట్‌లో ఐదు అసెంబ్లీ లైన్స్‌ ఉన్నాయి. వాహన అసెంబ్లీ యూనిట్‌లో రెండు అసెంబ్లీ లైన్స్‌ ఉన్నాయి. ఈ ప్లాంట్‌లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది.

స్వప్నిల్ మాట్లాడుతూ.. హోసూర్‌లో తమ నూతన తయారీ కేంద్రంతో ఎథర్‌ ఇప్పుడు నాణ్యతా ప్రమాణాల పరంగా ఈవీ పరిశ్రమలో నూతన బెంచ్‌మార్క్‌లను ఆవిష్కరిస్తుందని అన్నారు. తయారీ పరంగా శ్రేష్టతా ప్రమాణాలపై ఎక్కువగా దృష్టి సారించినట్టు చెప్పారు. ఈవీ విప్లవంలో రారాజుగా మారేందుకు ఎథర్ ఎనర్జీ ఎంతగానో శ్రమిస్తున్నట్టు చెప్పారు. ఎథర్‌ ఎనర్జీ తమ రిటైల్‌ కార్యకలాపాలను నూతన మార్కెట్‌లకు విస్తరించడం ద్వారా మరింత బలోపేతం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కంపెనీ మార్చి 2023 నాటికి 100 నగరాలలో దాదాపు 150 ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాలకు విస్తరించాలని భావిస్తోంది. ఇటీవల ఈ సంస్థ 500కు పైగా ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్‌ల మైలురాయిని అధిగమించింది. అంతేకాదు, వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి 1400 ఎథర్‌ గ్రిడ్స్‌ను ప్రారంభించడానికి ప్రణాళిక రచించింది.

Updated Date - 2022-11-24T21:43:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising