ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cloud Native Award: లండన్‌లో ప్రతిష్ఠాత్మక క్లౌడ్ నేటివ్ అవార్డు గెలుచుకున్న జియో

ABN, First Publish Date - 2022-11-04T16:29:43+05:30

అంతర్జాతీయ టెలికం మీడియా కంపెనీ టోటల్ టెలికం లండన్‌లో నిర్వహించిన వరల్డ్ కమ్యూనికేషన్ అవార్డ్స్ (WCA)లో క్లౌడ్ నేటివ్ అవార్డు (Cloud Native Award)ను కైవసం చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని అగ్రగామి టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) అరుదైన పురస్కారాన్ని అందుకుంది. అంతర్జాతీయ టెలికం మీడియా కంపెనీ టోటల్ టెలికం లండన్‌లో నిర్వహించిన వరల్డ్ కమ్యూనికేషన్ అవార్డ్స్ (WCA)లో క్లౌడ్ నేటివ్ అవార్డు (Cloud Native Award)ను కైవసం చేసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో ఈ ఏడాది విజేతలు కూడా ఉన్నారు. సెలబ్రిటీ బ్రాడ్ కాస్టర్ నినా హొసైన్ ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాస్ట్‌గా వ్యవహరించారు.

క్లౌడ్ నేటివ్ కేటగిరీలో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌కు ఈ అవార్డు లభించింది. ఆదరణ పొందిన కేటగిరీల్లో ఎరిక్‌సన్, టీపీజీ ఉన్నాయి. అలాగే, ‘బీ2బీ సర్వీస్ ఆఫ్ ద ఇయర్’, బెస్ట్ డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్ర్రోగ్రామ్, బెస్ట్ నెట్‌వర్క్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఇనిషియేటివ్ తదితర విభాగాల్లో అవార్డులు అందించారు. జయో ఈ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత యాప్‌లు, ప్లాట్‌ఫామ్‌లలో అత్యంత అధునాతన డిజిటల్, కనెక్టివిటీ ఎకోసిస్టం కోసం ఇప్పటి వరకు 50 బిలియన్ డాలర్లకుపైగా ఖర్చు చేసింది. జియో సేవలు ఇప్పుడు కనెక్టివిటీ, క్లౌడ్, మీడియా, డిజిటల్ కామర్స్, ఫైనాన్సియల్ సర్వీసెస్, గేమింగ్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, అగ్రికల్చర్, గవర్నమెంట్ టు సిటిజన్ (G2C), స్మార్ట్‌సిటీలు, మాన్యుఫ్యాక్చరింగ్‌కు విస్తరించింది.

Updated Date - 2022-11-04T16:29:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising