ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Techies: టెకీలకు వణుకు పుట్టిస్తున్న తాజా రిపోర్టులు !.. 2023 తొలి అర్ధభాగంలో..

ABN, First Publish Date - 2022-12-20T20:10:14+05:30

ప్రస్తుత సంవత్సరం 2022 మరికొన్ని రోజుల్లోనే కాలగర్భంలో కలిసిపోనుంది. మంచిచెడుల మిళితమైన ఈ ఏడాది కొన్ని రంగాలు కఠిన సవాళ్లను చవిచూశాయి. క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న రంగాల జాబితాలో ఐటీ సెక్టార్ (IT Sector) ప్రధానమైనది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ప్రస్తుత సంవత్సరం 2022 మరికొన్ని రోజుల్లోనే కాలగర్భంలో కలిసిపోనుంది. మంచిచెడుల మిళితమైన ఈ ఏడాది కొన్ని రంగాలు కఠిన సవాళ్లను చవిచూశాయి. క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న రంగాల జాబితాలో ఐటీ సెక్టార్ (IT Sector) ప్రధానమైనది. భారీ సంఖ్యలో ఉద్వాసనలతో ఉద్యోగులు తీవ్ర కలవరానికి గురయ్యారు. ట్విటర్, మెటా, యాపిల్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు సైతం వేలాది మంది ఉద్యోగులను తొలగించడం అందరినీ భయపెట్టింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 965 టెక్ కంపెనీలు (Tech companies) మొత్తం 150,000 మంది ఉద్యోగులను తొలగించాయంటే పరిస్థితులు ఎంత ఆందోళనకరంగా ఉన్నాయో అర్థంచేసుకోవచ్చు. 2008-09 నాటి మహామాంద్యం (Great Recession) నాటి కంటే ఎక్కువ మంది టెకీల ఉద్యోగాలు ఊడాయి. 2009లో 65,000 మంది ఉద్యోగాలు కోల్పోగా.. ఆ తర్వాత 2018లో దాదాపు ఇదే సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. ఇక కొవిడ్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 1400 కంపెనీలు మొత్తం 2 లక్షలకుపైగా మంది ఉద్యోగులపై వేటుపడినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2023 కూడా ఇందుకు మినహాయింపుగా ఉండబోదని రిపోర్ట్స్ హెచ్చరిస్తున్నాయి.

2022 మాదిరిగానే 2023 ఆరంభంలో టెకీలకు గడ్డుకాలమేనని, గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం ఉందని నివేదికలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు కఠిన సవాళ్లు ఎదురవ్వొచ్చని పేర్కొన్నాయి. టెక్ రంగంలో ఉద్యోగాల కోత 2022 మొదటి అర్ధభాగంలోనే మొదలైందని, ఆ తర్వాత ఏడాదంతా అవే పరిస్థితులు కొనసాగాయని ప్రస్తావించాయి. ఇవే పరిస్థితులు 2023 మొదటి అర్ధభాగంలో కొనసాగే అవకాశాలు ఉండొచ్చని రిపోర్టులు విశ్లేషించాయి. ట్విటర్, మెటా, అమెజాన్, ట్విటర్, నెట్‌ఫ్లిక్స్‌ వంటి బడా కంపెనీలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించగా.. రానున్న నెలల్లో మిగతా కంపెనీలు తొలగింపులకు పాల్పడే అవకాశాలున్నాయని పేర్కొంటున్నాయి. కాగా నవంబర్ మధ్య నాటికి యూఎస్ టెక్ రంగంలో మెటా, ట్విటర్, సేల్స్‌ఫోర్స్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఇతర కంపెనీలు 73 వేలకుపైగా మంది ఉద్యోగులను తొలగించాయి. ఇక ఇదే కాలానికి భారత టెక్ రంగంలో 17 వేల మంది టెకీల ఉద్యోగాలు పోయాయి.

Updated Date - 2022-12-20T21:03:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising