ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nirav Modi: యూకే కోర్టులో నీరవ్ మోదీ మరో పిటిషన్.. ఎంటంటే..

ABN, First Publish Date - 2022-11-24T19:25:51+05:30

భారత్‌కు అప్పగించాలనే యూకే కోర్టుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఎగవేతదారు, యూకేలో (UK) తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi) మరో అడ్డగింత ప్రయత్నం చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్ : భారత్‌కు అప్పగించాలనే యూకే కోర్టుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఎగవేతదారు, యూకేలో (UK) తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi) మరో అడ్డగింత ప్రయత్నం చేశాడు. భారత్‌కు అప్పగించాలంటూ యూకే సుప్రీంకోర్ట్ (UK Supreme Court) ఇటివల ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఉన్నతస్థాయి కోర్టులో మరో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌పై భారతీయ అధికారుల తరపున వాదనలు వినిపిస్తున్న సీపీఎస్ (క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్) స్పందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పూర్తిస్థాయి విచారణ లేకుండానే హైకోర్ట్ జడ్జి ఒకరు తీర్పు వెలువరించే అవకాశాలుంటాయని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

కాగా మానసిక స్థితి బాగాలేదంటూ కారణంగా పేర్కొంటూ నీరవ్ మోదీ ఇదివరకు చేసిన అప్పీల్‌ను న్యాయస్థానం ఈ నెలలోనే కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉందంటూ లాయర్ల చెప్పిన వాదనలతో ఇద్దరు సభ్యుల బెంచ్ ఏకీభవించలేదు. ఈ వాదనలను కొట్టిపారేసింది. కాగా నీరవ్ మోదీ ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను (PNB) 2 బిలియన్ డాలర్ల మేర మోసగించి యూకేలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వొర్త్ జైలులో ఉన్నాడు.

Updated Date - 2022-11-24T19:26:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising