ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nirav Modi: నీరవ్ మోదీకి యూకే కోర్ట్ బిగ్ షాక్.. అప్పగింతకు లైన్‌క్లియర్..

ABN, First Publish Date - 2022-11-09T16:58:15+05:30

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను (PNB) రూ.11 వేల కోట్ల మేర మోసగించి, యూకేలో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi) అప్పగింతకు మార్గం సుగుమమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను (PNB) రూ.11 వేల కోట్ల మేర మోసగించి, యూకేలో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi) అప్పగింతకు మార్గం సుగుమమైంది. భారత్‌కు (India) అప్పగింత ఆదేశాలను సవాలు చేస్తూ గతంలో అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను యూకే న్యాయస్థానం (UK Court) బుధవారం తోసిపుచ్చింది. దీంతో నీరవ్ మోదీని భారత్‌ తీసుకొచ్చేందుకు లైన్‌క్లియర్ అయ్యింది. దీంతో ఎట్టకేలకు భారత దర్యాప్తు ఏజెన్సీల కృషి ఫలించినట్టయ్యింది. కాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మోసం కేసులో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. వేల కోట్ల రూపాయల మోసం, మనీ ల్యాండరింగ్ కేసుల్లో నీరవ్ మోదీ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

కాగా నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలంటూ గత ఫిబ్రవరిలో వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్ట్ డిస్ట్రిక్ట్ జడ్జి సామ్ గూజెస్ గత ఫిబ్రవరిలో తీర్పునిచ్చారు. ఈ తీర్పుని సవాలు చేస్తూ లండన్ కోర్టులో నీరవ్ మోదీ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఫిబ్రవరిలో ఈ కేసుని పరిశీలించిన లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్, జస్టిస్ రాబర్ట్ జయ్ బుధవారం తాజా తీర్పునిచ్చారు.

Updated Date - 2022-11-09T17:21:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising