Ola Scooters: బోల్డన్ని అప్‌డేట్స్ తీసుకొచ్చిన ఓలా.. ఇక నడక ఆధారంగా స్కూటర్ లాక్!
ABN, First Publish Date - 2022-10-31T17:44:03+05:30
దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా (Ola) తమ ఎస్1 స్కూటర్ల కోసం ‘మూవ్ ఓఎస్ 3బీటా’ (Move OS 3)
న్యూఢిల్లీ: దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా (Ola) తమ ఎస్1 స్కూటర్ల కోసం ‘మూవ్ ఓఎస్ 3బీటా’ (Move OS 3) అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. దీపావళి సందర్భంగా ఈ అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇప్పుడు దీనిని కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ట్విట్టర్ పోస్టు ద్వారా తెలిపింది. మూవ్ ఓఎస్ 3 కోసం అక్టోబరు 25 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్టు పేర్కొంది. ఆసక్తి ఉన్న వారు https://moveos.olaelectric.com వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మూవ్ ఓఎస్ 3 బీటా యాక్సెస్ కోసం అభ్యర్థించవచ్చని తెలిపింది.
మూవ్ ఓఎస్ 3 ఫీచర్లు ఇవే..
మూవ్ ఓఎస్ 3 అప్‌డేట్‌లో హిల్-అసిస్ట్, ఫాస్ట్ చార్జింగ్‌తో మరెన్నో అప్‌డేట్స్ తీసుకొచ్చింది. అలాగే, ఓలా ఎస్1 లైనప్- ఓలా ఎస్ 1, ఓలా ఎస్1 ప్రొలో ఇప్పటికే ఉన్న ఫీచర్ల ఇంటర్‌ఫేస్, ఫంక్షనాలిటీని మరింత ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో ఏదైనా మేజర్ అప్‌డేట్ ఉందంటే అది ఫాస్ట్ చార్జింగే. దేశవ్యాప్తంగా 50 హైపర్ చార్జర్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ 15 నిమిషాలపాటు చార్జింగ్ చేస్తే 50 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని ఓలా తెలిపింది.
ఈ అప్‌డేట్‌లో మరో ముఖ్యమైన ఫీచర్ ‘ప్రాక్సిమిటీ అన్‌లాక్’. ఈ ‘సిక్త్ సెన్స్’తో ఓలా స్కూటర్ యూజర్లు నడక ద్వారా స్కూటర్‌ను లాక్, అన్‌లాక్ చేసుకోగలుగుతారు. అంటే.. వినియోగదారుడు స్కూటర్ దగ్గరికి వస్తున్నప్పుడు దానంతట అదే అన్‌లాక్ అవుతుంది. దూరంగా వెళ్లినప్పుడు ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది. అలాగే, ఇందులో పార్టీ మోడ్ కూడా ఉంది. వినియోగదారులు వింటున్న మ్యూజిక్‌తో హెడ్‌లైట్ సింక్ అవుతుంది. దీంతోపాటు మూవ్ ఓఎస్3లో మరో ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మనకు ఎవరైనా కాల్ చేస్తే అది స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీనికి ఆటో రిప్లై కూడా ఇవ్వొచ్చు. ఎస్1 లైనప్‌లో వివిధ రకాల మూడ్స్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. బోల్ట్ మూడ్ నుంచి వింటేజ్ మూడ్ వరకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు.
Updated Date - 2022-10-31T17:44:51+05:30 IST